అక్షయ తృతీయ రోజు ...ఈ మంత్రం జపిస్తే...

By telugu teamFirst Published May 7, 2019, 9:30 AM IST
Highlights

బలరామ నమస్తుభ్యం సర్వ వ్యసన నాశక అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అన్ని కష్టాలు తొలగుతాయి. కష్టాలకు మూలకారణములైన వ్యసనాలు పోతాయి.

వైశాఖమాసం నదీస్నానానికి ప్రశస్తమైనది. ఈ మాసంలో స్నానమే ఉత్తమ సత్ఫలితాలనందజేస్తుంది. అక్షయ తదియనాడు  (మే 7వ తేదీ) ఆరోజున పరశురామ జయంతి, అక్షయ తదియ గంగాస్నాన పుణ్య దివసం, సంపద్గౌరీవ్రతం, అనే విశేషాలు ఉన్నాయి. ఇది గొప్ప పుణ్యదినం. కాని లోకంలో బంగారం కొనుక్కోవాలి అనే విషయం ప్రచారం అవుతోంది. బంగారం కొనుక్కోవడం వల్ల మనకొచ్చే ప్రయోజనం లేదు. బంగారం దానం చేయాలి. బంగారం దానం చేయడంకోసం అవసరమైతే కొనుక్కోవచ్చు.

ఈ రోజు చేసే దానాలు అక్షయ ఫలితాన్నిస్తాయి. భవిష్యపురాణంలో ఒక గాథ ఉంది. పూర్వకాలంలో ఒక దరిద్రుడు, త్రియవాది సత్యవంతుడు, దేవ గురు జన భక్తుడు అయిన వైశ్య ప్రముఖుడున్నాడు. ఒకసారి వైశాఖంలో అక్షయ తదియనాడు గంగాస్నానంచేసి ఇంటికి వచ్చి దేవపూజ చేసి లడ్లూ విసన కర్రలు దానం చేసాడు. ఆ కోమి ఉత్తర జన్మలో కుష్యవతి నగరంలో ధనవంతుడైన క్షత్రియుడుగా ప్టుాడు. ఆ జన్మలో కూడా దానాలు చేస్తూనే ఉన్నాడు.

ఎంతగా దానం చేస్తూ ఉన్నా అతని సంపద క్షయం కాక అక్షయమౌతూ ఉంది. అని శ్రీకృష్ణుడు యుధిష్ఠరునకు చెప్పాడు. అక్షయ తదియనాడు గంగాస్నానం, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వాలి. ప్రతిరోజూ దేవతలకు ఋషులకు, పితృదేవతలకు తర్పణాలు ఇవ్వడం ద్వారా వ్యక్తికి సంతృప్తికరమైన జీవనం లభిస్తుంది. సామాన్యంగా ఎంత సంపద ఉన్నా సంతృప్తి లేనప్పుడు ఆనందం ఉండదు. ప్రతిరోజూ దేవ ఋషి పితృ తర్పణాల ద్వారా ఉన్న సంపదనే సంతృప్తితో అనుభవించగల ఉత్తమ మానసిక స్థితి అలవడుతుంది. లోకంలో నేరాలన్నీ అసంతృప్త జీవనం వల్లనే సంభవిస్తున్నాయి. లక్ష్మీనారాయణులను, గౌరీ త్రిలోచనులను పూజించి విసనకర్రలు లడ్లు పంచిప్టోలి. యవాన్నం నివేదించాలి. దీనివలన వైకుంఠం కైలాసం సిద్ధిస్తాయి. నవధాన్యాలు, గ్రీష్మ ఋతువులో లభించే ఇతర వస్తు సముదాయం జల పూరిత కుంభం దానం చేయాలి.

ఒకపూటే భోజనం చేయాలి. తీర్థస్నానం, తిలలతో పితృ తర్పణం, ధర్మఘటదానం, దద్ధ్యన్న వ్యజన ఛత్ర, పాదుక ఉపానహ దానం చేయాలి. ఇదేరోజు త్రేతాదియుగాది కావడం వల్ల పితృదేవతారాధన వల్ల సంతానం అభివృద్ధిలోకి వస్తారు. ఆరోగ్యంగా ఉంారు. సమాజానికి ఉపయుక్తులౌతారు. తల్లి తండ్రులను గౌరవించేవారవుతారు. తాము పితృదేవతలను ఆరాధించకుండా తమ పిల్లలకు తమకు అనుకూలం కావాలని ఆశించడం సరియైన విధానం కాదుకదా.

బలరామ నమస్తుభ్యం సర్వ వ్యసన నాశక అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా అన్ని కష్టాలు తొలగుతాయి. కష్టాలకు మూలకారణములైన వ్యసనాలు పోతాయి. సింహాచలంలో ఈరోజు చందనోత్సవం చేస్తారు. సంప్రదాయంలో వైశాఖపూజ అనే పేరుతో పండితులను ఊరి పెద్దలను పిలిచి మామిడిపళ్ళు పనస తొనలు విసనకర్రలు మొదలైనవి పంచి పెట్టడం సంప్రదాయంలో ఉంది.

 వేసవిలో పచ్చ కర్పూరం కలిపిన నీటిని మ్టిపాత్రతోనే తాగడం ఆరోగ్యానికి మంచిది. కొందరు భాద్రపద శుద్ధ తదియనాడు బలరామజయన్తి చేస్తారు. ఆ విషయం పద్మపురాణంలో ఉంది.  మొత్తంపైన అక్షయ తదియనాడు అక్షయమైన బంగారాన్నిదానం చేయడం ద్వారా అక్షయ ఫలితమైన మోక్షాన్ని పొందుతారు. అని అర్థం చేసుకోవచ్చు. బంగారం అక్షయం ఎందుకంటే ఇక ఏ పదార్థాన్నైనా నిప్పుల్లో వేసినప్పుడు దాని బరువు తగ్గుతుంది. బంగారం ఎన్ని మార్లు కరిగించినా తరగకుండా ఉంటుంది. అలా ఎన్నిమార్లు అగ్నిలో దగ్ధమైననూ క్షయము కానిది బంగారమొక్కటే. కావున బంగారం కొనుక్కోవడం కాదు. దానం చేయడానికి కొనుక్కోవాలి.

click me!