జాతకం... ఆరోగ్యం కుదుటుపడుతుందా?

By ramya NFirst Published Mar 20, 2019, 1:58 PM IST
Highlights

మాకు పంపిన కొందరి జాతకాల వివరాలు ఇక్కడ ఉన్నాయి

1.ఆశాలత

ఆరోగ్య సమస్యలు? ఎప్పుడు కోలుకుంటుంది.

16 జులై 2019 వరకు కొంత ఒత్తిడి సమస్యలు ఇలాగే ఉంటాయి. జులై తర్వాతనుంచి కొద్దికొద్దిగా మార్పులు మొదలౌతాయి. 2023 తర్వాత అన్ని ఆరోగ్య సమస్యలు తీరుతాయి. పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది. 2023 తర్వాతనే వివాహ ప్రయత్నాలు కూడా చేసుకోవచ్చు. దానాలు జపాలు ఎక్కువగా చేయాలి.

 

అమ్మాయికి ఎంత వీలైతే అంత వాటన్నిలో ఉండాలి. ఎవరో చేస్తూ ఉంటారు అనేది కాదు.

జపం : క్రీం అచ్యుతానంత గోవింద నిరంతరం జపం చేసుకోవాలి.

సూర్య అష్టకం, ఆదిత్యహృదయ పారాయణలు తప్పనిసరి. అరుణపారాయణం చేయించుకోవాలి. ఆదివారం సూర్యునికి  ఎక్కువసార్లు నమస్కారం చేయాలి. ఆరోగ్య పాశుపతం, అరుణహోమం చేయించుకోవాలి.

దానం : గోధుమరవ్వ/ చపాతీలు/ కార్యరెట్/ ఆరెంజ్‌ రంగు వస్త్రాలు దానం చేయాలి.

క్యారెట్ ముక్కలు జ్యూస్‌ కాని, క్యారెట్ కాని తినాలి. గోధుమనారు ఆహారంగా స్వీకరించాలి. గోధుమతో ఇంకా ఏమైనా వంటకాలు ఉంటే అవి అన్నీ ఆహారంగా స్వీకరించాలి. దానం చేయాలి.

అమ్మాయికి వీలైతే ప్రతిరోజూ సూర్యనమస్కారాలు చేయాలి. ఇవి అన్నీ చేస్తూ ఉంటే అమ్మాయి జులై తర్వాత నుంచి మార్పులు తప్పనిసరిగా మొదలౌతాయి.

2.మాధురి దీక్షిత్‌

ప్రభుత్వ ఉద్యోగం వస్తుందా?

ప్రస్తుతం సమయం అనుకూలంగా ఉంది. ముద్రాధికారం కలిగిన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రయత్నం చేసుకోండి

దానం : అన్నదానం / పాలు/ పెరుగు , 2. కందిపప్పు / కర్జూరాలు దానం చేయండి

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః నిరంతరం చేసుకుంటూ ఉండండి.

శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం కూడా నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

మీకు ప్రస్తుతం వివాహానికి కూడా అనుకూల సమయం. ప్రయత్నాలు చేసుకోండి.

3. కమల్‌ తేజ

భవిష్యత్తు ఎలా ఉంది?

మీకు ప్రస్తుతం సమయం అనుకూలంగానే ఉన్నది.  2020 జులై తర్వాత నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది. పనుల్లో ఆలస్యం, శ్రమ, కాలం, ధనం వృథా అవుతూ ఉంటాయి. అప్పుడు జాగ్రత్త పడండి.

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం మంచిది.

దానం : ఇడ్లీ / వడ/ మినుప సున్ని ఉండలు 2. ఆకుకూరలు / కాయ గూరలు దానం చేయండి.

రామకృష్ణ

మీరు ప్టుిన సమయం, తేదీ పంపారు కాని ఏ సంవత్సరం అనే వివరాలు పంపలేదు. వివరాలు పూర్తిగా లేకపోతే జాతకం చెప్పడం సాధ్యం కాదు

రవికిరణ్‌ రెడ్డి

మీరు ప్టుిన సమయం చెప్పలేదు. కావున జాతకం చెప్పడానికి వీలుపడదు. నక్షత్రం మొత్తం రోజు అంతా ఉంటుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!