ఈ గ్రహణం భారత్ లోనూ స్పష్టంగా కనపించింది. అయితే, వచ్చే ఏడాది ఏ గ్రహణాలు సంభవించనున్నాయి. మళ్లీ సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఎప్పుడు సంభవిస్తాయో తెలుసుకుందాం..
హిందూమతంలో సూర్య గ్రహణం, చంద్రగ్రహణం లను చాలా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.. గ్రహణానికి మతపరమైన ప్రాముఖ్యత ఉంది. కంటితో స్పష్టంగా కనిపించని సూర్య, చంద్ర గ్రహణానికి మతపరమైన ప్రాముఖ్యత లేదు. కానీ, మన దేశంలో కనపడితే మాత్రం చాలా మంది కచ్చితంగా గ్రహణ నియమాలను పాటిస్తూ ఉంటారు.. సూతక కాలంలో కనీసం ఆహారం కూడా తీసుకోరు. గ్రహణం వీడిన తర్వాత ఇంటిని శుభ్రం చేసుకుంటారు. ఇలా చాలా నియమాలు పాటిస్తారు.
ఈ ఏఢాది రెండు,సూర్య గ్రహణాలు, రెండు చంద్ర గ్రహణాలు సంభవించాయి. రీసెంట్ గా చంద్ర గ్రహణం సంభవించింది. ఈ గ్రహణం భారత్ లోనూ స్పష్టంగా కనపించింది. అయితే, వచ్చే ఏడాది ఏ గ్రహణాలు సంభవించనున్నాయి. మళ్లీ సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం ఎప్పుడు సంభవిస్తాయో తెలుసుకుందాం..
undefined
2024లో మొదటి చంద్రగ్రహణం మార్చి 25, 2024 సోమవారం నాడు సంభవిస్తుంది. 2024లో రెండవ చంద్రగ్రహణం సెప్టెంబర్ 18, 2024 బుధవారం నాడు సంభవిస్తుంది.
2024లో మొదటి సూర్యగ్రహణం ఏప్రిల్ 08, 2024 సోమవారం నాడు ఏర్పడుతుంది. ఇది సంపూర్ణ సూర్యగ్రహణం అవుతుంది. ఇది భారత్ లో కనిపించదు. 2024లో రెండవ సూర్యగ్రహణం అక్టోబర్ 2, 2024 బుధవారం నాడు ఏర్పడుతుంది. రెండవ సూర్యగ్రహణం కూడా భారత్ లో కనిపించదు.