leo: 2020లో సింహరాశి ఫలితాలు

Published : Dec 28, 2019, 02:09 PM IST
leo: 2020లో సింహరాశి ఫలితాలు

సారాంశం

సంతానం పోటీల్లో గెలుపుకోసం ప్రయత్నిస్తారు. ఒకవేళ వాళ్ళు సాధించడంలో కొంత ఇబ్బంది పడినా వారికి సహాయ సహకారాలు అందిస్తారు. చేసే అన్ని పనుల్లోనూ సంతృప్తి లభిస్తుంది. తాము అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

వీరికి సంతానం అనుకూలంగా ఉంటుంది. మాట వింటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. విద్యార్థులు ఉన్నత విద్యలపై దృష్టి పెడతారు. సృజనాత్మకత పెరుగుతుంది. ఉపాసనను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. దానం కొద్ది బిడ్డలు అనే మాట వీరికి వర్తిస్తుంది. సంతానం పోటీల్లో గెలుపుకోసం ప్రయత్నిస్తారు. ఒకవేళ వాళ్ళు సాధించడంలో కొంత ఇబ్బంది పడినా వారికి సహాయ సహకారాలు అందిస్తారు. చేసే అన్ని పనుల్లోనూ సంతృప్తి లభిస్తుంది. తాము అనుకున్న పనులు పూర్తి చేస్తారు.

వీరికి కడుపుకు సంబంధించిన అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించాలి. అధిక శ్రమతో సౌకర్యాలను సమకూర్చుకుంటారు. తక్కువ శ్రమతో వచ్చే ఫలితానికి సంతోషం ఎక్కువగా ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఊహించని ఇబ్బందులు, ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది. ఏ ఫలితాన్ని కూడా ఆశించ కుండా ఉండాలి. ఆశించిన ఫలితం రాదు. సంతృప్తి తక్కువగా ఉంటుంది.

చేసే పనుల్లో నిరాశలు ఉంటాయి. ఆశించిన గుర్తింపు రాకపోవచ్చు. శత్రువులపై విజయ సాధనకు ప్రయత్నం చేస్తారు. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుకునే ప్రయత్నం చేయాలి.

AlsoRead Cancer: 2020లో కర్కాటక రాశి ఫలితాలు.

వీరు ప్రతిరోజూ యోగా, ప్రాణాయామాలు, లేదా వాకింగ్‌ చేయడం తప్పనిసరి. దుర్గా స్తోత్ర పారాయణలు, మినప సున్ని ఉండలు, ఇడ్లీ, వడలు దానం చేయాలి. పశు పక్షాదులకు ఆహారాన్ని పెట్టాలి. పసుపు రంగు వస్త్రాలను, నీలిరంగు వస్త్రాలను దానం చేయడం మంచిది.

ఈ రాశివారికి మొత్తంపై అంత అనుకూలత ఉండదు. అన్ని గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకోవడం తప్పనిసరి. ఆ పరిహారాల వల్ల వీరు ఉన్న స్థితినుంచి కిందికి పడిపోకుండా ఉండడానికి అవి ఉపయోగపడతాయి.

PREV
click me!

Recommended Stories

Dream Astrology: పదే పదే ఈ కల వస్తే.. మీ జీవితంలో అద్భుతాలు జరగడం ఖాయం!
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన అబ్బాయిలు తమ భార్యలను ప్రతి నిమిషం మోసం చేస్తూనే ఉంటారు..!