
మన ఇంటికి అతిథులు రావడం చాలా సహజం. అయితే... ఇంటికి వచ్చిన అతిథుల్లో కొందరు పాజిటివ్ ఎనర్జీని తీసుకువస్తే... కొందరు మాత్రం నెగిటివ్ ఎనర్జీ స్ప్రెడ్ చేస్తుంటారు. కాగా... వారు నిజంగా మన ఇంటికి నెగిటివ్ ఎనర్జీ తీసుకువస్తున్నారు అంటే.. దానికి సంకేతాలు ఇవే..
1. మీ ఇంటికి వచ్చిన అతిథులు.. మీ ఇంట్లోని ప్రతి విషయంలో ఫాల్ట్ వెతుకుతూ ఉన్నారంటే వారు నెగిటివ్ పర్సన్ అని అర్థం. వారు మీ లో, మీ కుటుంబ సభ్యుల్లో, మీ ఇంట్లో లోపాలు వెతుకుతూ ఉంటారు.
2.కొంత మంది అతిథులు ఇంటికి వచ్చినప్పుడు మనం చాలా అన్ కంఫర్ట్ గా ఉంటుంది. వారు ఎప్పుడెప్పుడు ఇంట్లో నుంచి వెళ్లిపోతారా అనిపిస్తూఉంటుంది.
3.మీ ఇంటికి పాజిటివ్ పర్సన్ వస్తే... వారు మీ సమస్యలను బయటకు తవ్వడం లాంటివి చేయరు. ముఖ్యంగా మీ ప్రైవేట్ విషయాల్లో తలదూర్చరు. కానీ... అలా కాకుండా నెగిటివ్ పర్సన్ వస్తే....ప్రైవేట్ విషయాల్లో కూడా తలదూరుస్తారు. మీ సమస్యలన్నీ తెలుసుకొని వారు సంబరపడుతూ ఉంటారు.
4.నెగిటివ్ పర్సన్ మీ ఇంటికి వస్తే... మీరు మీ జీవితంలో ఏం చేయాలి అనే విషయాన్ని కూడా వారే నిర్ణయిస్తూ ఉంటారు. మీ ఉద్యోగం విషయంలో... మీ వ్యక్తిగత విషయాల్లో తలదూర్చి నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు.
5. మీ ఇంటికి వచ్చిన అతిథి నెగిటివ్ ఎనర్జీతో ఉంటే... వారు నిరాశవాదిగా ఉంటారు. అన్నింట్లోనూ నిరాశను వ్యక్తం చేస్తూ ఉంటారు. మీరు బాధ పడుతున్నారనే విషయాన్ని కూడా పట్టించుకోకుండా... వారు మీ లోని నెగిటివ్స్ చెబుతూనే ఉంటారు.
6.మీ ఇంట్లోకి నెగిటివ్ పర్సన్ ఎంటర్ అయితే.... ఇళ్లు కూడా నెగిటివ్ గా మారుతుంది. మీకు ప్రశాంతంగా నిద్ర కూడా పట్టదు. వారి వల్ల ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది.