సూర్యాస్తమయం తర్వాత ఈ వస్తువులు ఎవరికైనా ఇస్తే అరిష్టం..!

By Ramya news teamFirst Published Jan 25, 2022, 4:29 PM IST
Highlights

ప్రతిదానికీ ఓ సమయం ఉంటుందట.కొన్ని సందర్భాల్లో, కొన్ని వస్తువులను ఇంటి నుండి బయటకు పంపడం అరిష్టం. జ్యోతిష్యం ప్రకారం, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదట. అవేంటో ఓసారి చూద్దామా..
 

మనిషి స్నేహపూర్వక జీవి. ఒకరికి మరొకరు తోడుగా ఉంటారు. ఎదుటివారితో ఇచ్చిపుచ్చుకోవడం చాలా సర్వ సాధారణ విషయం.  కొంత మంది కష్టాల్లో ఉన్నప్పుడు డబ్బులు అడుగుతారు, మరికొందరు ఎక్కువగా ఇరుగుపొరుగు వారు వెంటనే దుకాణానికి వెళ్లకుండా పాలు, పెరుగు, పంచదార వంటివి తెచ్చుకుంటున్నారు.అయితే.. మనం ఏదైనా వస్తువు కొనేటప్పుడు లేదా.. ఎవరికైనా ఇచ్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. ప్రతిదానికీ ఓ సమయం ఉంటుందట.కొన్ని సందర్భాల్లో, కొన్ని వస్తువులను ఇంటి నుండి బయటకు పంపడం అరిష్టం. జ్యోతిష్యం ప్రకారం, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత కొన్ని వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదట. అవేంటో ఓసారి చూద్దామా..

దేవత
లక్ష్మి సంపదకు మూలం. సాయంత్రం దీపం పెడితే లక్ష్మి ఇంటికి వస్తుందని నమ్మకం. అలాంటప్పుడు ఆ సమయంలో ఎవరికైనా డబ్బులు ఇస్తే లక్ష్మిని దాటేసినట్లే అవుతుంది. అంటే మీ ఇంటి నుంచి లక్ష్మీ దేవి గడప దాటుతుందని అర్థమట.  కాబట్టి, సూర్యాస్తమయం తర్వాత ఎవరూ డబ్బు ఇవ్వకూడదు. అప్పులు, విరాళాలు, సాయంత్రం తర్వాత ఇవ్వకూడదు.

పాలు 
ఇంట్లో తయారుచేసిన పాలు పెరుగు ఎక్కువగా ఉంటే వృద్ధికి సంకేతం. పాలు లక్ష్మీదేవి , విష్ణువుతో సంబంధం కలిగి ఉంటాయి. క్షీరసాగరంలో లక్ష్మీదేవి, విష్ణువు ఉంటారని నమ్ముతారు. ఇలా సాయంత్రం పూట ఇంట్లో నుంచి పాలు , పెరుగు ఎవరికీ ఇవ్వకూడదు. దాని వల్ల   ఇంటి ఎదుగుదల మందగిస్తుంది అని నమ్ముతారు.


పసుపు
వీనస్ గ్రహంతో కూడా సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి, ఎవరైనా సూర్యాస్తమయం తర్వాత పసుపు ఇస్తే, జాతకంలో గురువు బలహీనపడతాడు. ఇది, వ్యక్తికి డబ్బు లేకపోవడంతో పాటు, గురువు  బలాన్ని తగ్గిస్తుంది.

వెల్లుల్లి , ఉల్లిపాయలు
జ్యోతిషశాస్త్రంలో, ఉల్లిపాయ, వెల్లుల్లి కేతువుతో సంబంధం కలిగి ఉంటాయి. అందువల్ల, ఉల్లిపాయ వెల్లుల్లి సాయంత్రం తర్వాత ఎవరికైనా ఇస్తే.. వారి పరిస్థితి అధ్వాన్నంగా మారుతుందని నమ్ముతారు. కాబట్టి.. సాయంత్రం తర్వాత ఎవరికీ ఇవ్వకూడదు.


ఉ ప్పు
సాయంత్రం సమయంలో ఉప్పు ఎవరికైనా ఇష్తే.. వారికి  అప్పుల భారం పెరుగుతుందట. కాబట్టి సాయంత్రం తర్వాత ఎవరికీ ఉప్పు, పచ్చళ్లు ఇవ్వకూడదు.

click me!