లోకాలకు కక్షుదార్తి తీర్చే మాతృస్వరూపమే ఈ అన్నపూర్ణాదేవి. శివుడంతివాడికే అమ్మయై భిక్ష వేసింది. ఆమె సంతానంలాిం మనందరం సుఖసంతోషాలతో విలసిల్లాలని మనలను కరుణిస్తుంది. ఈరోజు అన్నదానం చేయడం విశేషం. అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్నిస్తుంది.
ఉర్వీ సర్వ జయేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నీల సమాన కుంతల ధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షాన్ మోక్షకరీ సదాశుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
మూడవరోజు అమ్మవారి అలంకారం అన్నపూర్ణాదేవి. 'అన్నపూర్ణే, సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే' అంటూ కొలిచే ఈ అమ్మ మన అందరికీ ఇంో్ల కొదువ లేకుండా ధాన్యాన్ని సమకూర్చే దేవత. లోకాలకు కక్షుదార్తి తీర్చే మాతృస్వరూపమే ఈ అన్నపూర్ణాదేవి. శివుడంతివాడికే అమ్మయై భిక్ష వేసింది. ఆమె సంతానంలాిం మనందరం సుఖసంతోషాలతో విలసిల్లాలని మనలను కరుణిస్తుంది. ఈరోజు అన్నదానం చేయడం విశేషం. అన్ని దానాల్లోకి అన్నదానం విశేషమైన ఫలితాన్నిస్తుంది.
ఆహారానికి శక్తి ఉంటుంది. శక్తితో కూడుకున్న ఆహారమే మన శరీరం అవుతుంది. మన మనస్సు కూడా ఆహారంయొక్క స్వరూపమే. ఆహారాలు 3 రకాలుగా ఉంాయి. సాత్విక, రాజస, తామసాలు. శక్తిలేని ఆహారాన్ని మనం స్వీకరించం. అన్నపూర్ణగా కొలిచే అమ్మవారిలో అన్ని ధాన్యాలలోను అలాగే తినే ఆహార పదార్థాలలో ఉండేటటువిం అంతఃశక్తిని కొలిచే విధానాన్ని ఈ నవరాత్రులలో గుర్తుచేసుకోవడం. ఉపనిషత్తులు అన్నమే బ్రహ్మగా వర్ణించాయి. (అన్నం బ్రహ్మేతి వ్యజానాత్) అన్నం వలన సకల భూతాలు ఉద్భవిస్తున్నాయని చెప్పాయి. అటువిం అన్నాన్ని నిందించడం, పరీక్షించడం, వదిలిపెట్టడం వింవి పాపకార్యాలుగా శాస్త్రాలన్నీ చెపుతున్నాయి. శక్తి స్వరూపమైన ఈ అన్నం ఉపేక్షించి వదిలిపెట్టడం ద్వారా మనకు లభించకుండా పోతుందనేది భారతీయుల సంప్రదాయం. అందువల్ల పూర్ణ శక్తివంతమైన ఆహారాన్ని (అన్నాన్ని) స్వీకరించి దాన్ని దైవంగా ఆరాధించే సంప్రదాయం ఈ నవరాత్రుల్లో మనకు కనిపిస్తుంది.
సాత్వికమైన హిత, మిత ఆహారాలు భగవంతునికి చేరువ కావడానికితోడ్పడతాయని అందరు ఆధ్యాత్మిక వేత్తలు చెపుతున్నమాటే. ఆ శక్తిని నిరంతరం ఉపాసిస్తూ ఆ ఆహారంలోని అమ్మవారిని నమస్కరించుకోవడం ఈ నవరాత్రుల్లో అన్నపూర్ణాదేవి అవతార విశేషం. అన్నపూర్ణాదేవి దగ్గర అపరిమిత శక్తితో కూడుకున్న ఆహార భిక్షను స్వీకరించడమే తీసుకున్న భిక్షకు నమస్కారం తెలియజేయడమే ఈ ప్రత్యేక పూజకు ఫలితం.
అమ్మవారు లేత గోధుమరంగు (హాఫ్ వైట్) చీర ధరించి భక్తులను అనుగ్రహిస్తుంది. అదేవిధంగా ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే పదార్థం శాకాన్నం. ఇది వాతాన్ని హరిస్తుంది. శ్రమను పోగొడుతుంది. గుండె నీరసాన్ని తగ్గిస్తుంది. కఫ, పైత్యములను తగ్గిస్తుంది. నేత్ర రోగాలను నయం చేస్తుంది. శరీర కాంతిని పెంచుతుంది. కడుపులో తాపాన్ని పోగొడుతుంది. కిడ్ని వ్యాధుల్ని కూడా నివారిస్తుంది.
డా.ఎస్.ప్రతిభ