దసరా నవరాత్రి... గాయత్రి దేవి అవతారంలో అమ్మవారు

By telugu teamFirst Published Sep 30, 2019, 10:02 AM IST
Highlights

మననాత్‌ త్రాయతే ఇతి మంత్రః అని చెప్పినట్లుగా గాయత్రిదేవిని సూర్యునిద్వారా మనకు ప్రసరింపబడే ఉష్ణశక్తి వెలుతురు ఈ గాయత్రీమాత ప్రసాదమే. ఇదే మాతను విడదీసి గాయత్రి, సావిత్రి, సరస్వతిగా చూసే సంప్రదాయం కూడా ఉంది. వెలుగువల్ల జ్ఞానం పెరుగుతుంది. వేడివల్ల ప్రాణశక్తి పెరుగుతుంది.

యో దేవస్సవితాస్మాకం ధియో ధర్మాది గోచరాః

ప్రేరయేత్‌ తస్య యద్భర్గస్త ద్వరేణ్యముపాస్మహే

నవరాత్రుల్లో అమ్మవారు రెండవరోజు గాయత్రీదేవి రూపంలో మనకు దర్శనమిస్తుంది. గాయత్రీదేవి మనకు సూర్య సంబంధమైన దేవత. ఈమెను కొలవడం వల్ల కుటుంబంలో ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఉండవు. ఈ అమ్మవారు విశేషంగా ఐదు ముఖాలతో మనలను అనుగ్రహిస్తుంది. పంచభూతాలైన భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం వీటి తేజస్సును తనలో ఇముడ్చుకుని ఈ పంచముఖాలు అలరారుతాయి. బుద్ధి వికసిస్తుంది.

మననాత్‌ త్రాయతే ఇతి మంత్రః అని చెప్పినట్లుగా గాయత్రిదేవిని సూర్యునిద్వారా మనకు ప్రసరింపబడే ఉష్ణశక్తి వెలుతురు ఈ గాయత్రీమాత ప్రసాదమే. ఇదే మాతను విడదీసి గాయత్రి, సావిత్రి, సరస్వతిగా చూసే సంప్రదాయం కూడా ఉంది. వెలుగువల్ల జ్ఞానం పెరుగుతుంది. వేడివల్ల ప్రాణశక్తి పెరుగుతుంది. ''ధీయోయోనః ప్రచోదయాత్‌'' అన్నచోట కూడా బుద్ధివికాసం కూడా కలగాలంటే సూర్యాంతర్గతమైన గాయత్రీమాత ఆరాధన తప్పనిసరి. సూర్యోదయంతోపాటు వచ్చే ఈశక్తిని ఆరాధించానికే ప్రతీరోజూ అర్ఘ్యప్రదానం చేస్తారు.

ఈ అమ్మవారి అనుగ్రహంకోసం తర్పణాలు ఇడుస్తారు. అమ్మవారి ధ్యానంలో ''తత్వార్థ వర్ణాత్మికాం'' అనేదానిలో సూర్యునిలోని అసలుశక్తి స్వరూపమే గాయత్రీతత్వం అని తెలియజేస్తుంది. ఆ శక్తివల్లనే ఈ ప్రపంచానికి అన్ని రకాల ఆహారవ్యవహారాలు జరుగుతున్నాయి. వృక్షపు పత్రాలు సూర్యకిరణాలతో చేసే - కిరణజన్య సంయోగకక్రియ ఈ శక్తి వల్లనే జరుగుతుంది. ఆ శక్తివల్లనే మనకు ఆహారం ఏర్పడి సూర్యునిలోని శక్తిని మనం పరోక్షంగా స్వీకరిస్తున్నాం. అంటేమన శరీరంలోని అన్ని కణాల్లో ఈ అమ్మవారి శక్తి ఉన్నట్లే. మనలో ఉండి మనల్ని నిర్వహిస్తున్న ఆ అమ్మవారి శక్తి స్వరూపానికి నమస్కారం చేయడమే ఈ నవరాత్రుల్లో గాయత్రీదేవికి చేసే పూజ.

అమ్మవారికి భార్గవి అని పేరు కూడా ఉంది. సూర్యునికి భర్గుడు అని పేరు పెట్టడం కూడా ఈ అమ్మవారి వలనే. భర్జనం అనగా వేయించడం (భర్జనం) అని అర్థం. విత్తనాన్ని వేయించినట్లైతే మళ్ళీ మొలకెత్తవు. మనలో ఉండేటటువిం పాప కర్మలను అట్లావేయించే తత్వం ఉండడం వల్ల ఈ అమ్మను భార్గవి అని పిలుస్తాం. 'సవితృ' శబ్దానికి సూర్యుడు అని అర్థం. సూర్యునిలోని ఒకరకమైన తేజస్సుకు సావిత్రి అని పేరుకూడా ఉంది. గాయత్రి, సావిత్రి సమానమైన అర్థాలు కూడా ఉంాయి. వరద, అభయ, అంకుశ, కపాల, గద, శంఖం, చక్రం మొదలైన ఆయుధాలు ధరించిన ఈ అమ్మవారు నిరంతరం మన వెంట ఉండి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఆమెను ఉపాసిద్దాం, ఆ తత్త్వాన్ని అర్థం చేసుకొని ప్రార్థిద్దాం.

అమ్మవారు నారింజరంగు వస్త్రాలతో సూర్యునికి ప్రతిరూపంగా దర్శనమిస్తుంది. ఈరోజు అమ్మవారికి నైవేద్యం చిత్రాన్నం. నిమ్మకాయ క్యాన్సర్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పులుపు శుక్రునికి కారకం అవుతుంది. ప్రతీ రోజూ నిమ్మకాయను కట్చేసి నీటిలో వేసుకుని ఆ నీటిని త్రాగుతూ ఉండడం వల్ల పదివేలరెట్లు కెమోథెరపీ కంటే ఎక్కువగా వ్యక్తిపై పనిచేస్తుంది. రోగ నిరోధక శక్తిని బాగా వృద్ధిచేస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!