మేష రాశి వారికి - ధనుస్సులో శని సంచార ప్రభావం

By ramya neerukondaFirst Published Dec 25, 2018, 2:08 PM IST
Highlights

మేషరాశివారికి ధనుస్సులో శని సంచారం ఉన్నది. వీరికి సేవకుల సహకారం దొరుకుతుంది. దానిని వీరు వినియోగించుకోవాలి. దగ్గరి దగ్గరి ప్రయాణాలు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు.

శని గ్రహానికి మందుడు అని పేరు. ఇతను చాలా నెమ్మదిగా కదులుతాడు. గోచారరీత్యా ఒక రాశినుంచి వేరొక రాశికి మారడానికి దాదాపుగా 2 1/2 సం||లు పడుతుంది. కాబట్టి ఈ గ్రహం ఏ రాశిలో ఏ భావంలో ఉన్నదో గోచార రీత్యా ఆ రాశివారు ఆ భావానికి సంబంధించిన జాగ్రత్తలు తప్పక తీసుకుంటూ ఉండాలి. ప్రస్తుతం మేషరాశి వారికి ఎలా ఉన్నదో ఇప్పుడు చూద్దాం.

మేషరాశివారికి ధనుస్సులో శని సంచారం ఉన్నది. వీరికి సేవకుల సహకారం దొరుకుతుంది. దానిని వీరు వినియోగించుకోవాలి. దగ్గరి దగ్గరి ప్రయాణాలు ఆధ్యాత్మిక యాత్రలు చేస్తారు. విద్యార్థులు కొంచెం బద్దకాన్ని ప్రదర్శిస్తారు. ఆ బద్దకాన్ని వదిలించుకునే ప్రయత్నం చేయాలి.

వీరికి పోీల్లో నిలబడాలని ఆలోచన ఉంటుంది. కాని ఆ పోీల్లో తట్టుకుని విజయాన్ని అంత తొందరగా సాధించలేరు. వీరు చేసే ప్రతీ పనిలోను ఎదుటివారు ఎదో ఒక రకంగా అడ్డు చెపుతు ఉంటారు. కోపావేశాలను తగ్గించుకోవాలి. వీరికి ఆలోచన రావడమే తొందరగా ఉండదు. వచ్చిన తర్వాత ఆ పని కార్యరూపం దాల్చడానికి చాలా సమయం పడుతుంది. 

వీరు ఉన్నత విద్యలపై ఆసక్తిని పెంచుకోవాలి. ఉన్నత విద్యలు అంటే టెక్నికల్‌ అంశాలు కాదు. వీరు తర్కం, న్యాయం, మీమాంస, ధర్మశాస్త్రాలు మొదలైనవి ఈ సంవత్సరం వీరికి ఎక్కువగా ఉపయోగపడతాయి. వీరు ఆధ్యాత్మిక విషయాల్లో మంచి పరిణతిని సాధిస్తారు. సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి ఉంటుంది.

వీరికి లాభాలు వచ్చినా అవి అంత సంతృప్తికరంగా ఉండవు. ఏదో ఒక వెలితి కనబడుతుంది. ఎక్కువ శ్రమతో కొంచెం ఫలితాలు సాధిస్తారు. అవి వీరికి అందుబాటులో రావడానికి కొంచెం సమయం పడుతుంది. ఊహించినంత అనుకూలత మాత్రం ఉండదు.

వీరికి సేవకుల సహకారం అందుతుంది అని తెలుసుకుని వాటిని ఎక్కువగా ఉపయోగించరాదు. సేవకులు ఇచ్చిన సహకారంలో వారికి ఆశింపు ఉంటుంది. దానిని వీరు చేరుకోలేకపోతే వీరు పుణ్యాన్ని కోల్పోతారు. మళ్ళీ ఇబ్బందులపాలు కావాలి. కావున సహకారం ఆశింపులేకుండా వచ్చే విధంగా ప్రయత్నం చేసుకోవాలి.

వీరికి పోీల్లో గెలుపు రావడానికి కూడా మొండి పట్టుదల కావాలి. వీరు కొంత బద్ధకాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తమ శరీరాన్ని తాము కాపాడుకుని, గ్టిగా నిలబడే ప్రయత్నం చేయాలి. తమను తాము నిరూపించుకోవాలంటే వీరు ప్రతీరోజూ యోగాసనాలు, ప్రాణాయామాలు చేయాలి. రోగనిరోధక శక్తిని పెంచుకోవాలి. లేకపోతే అనారోగ్యాలు వచ్చే సూచనలు ఉన్నాయి. కొంచెం పెద్దవారు, లేదా ఊబకాయం ఉన్నవారు అవుతే కనుక మోకాళ్ళనొప్పులు వచ్చే సూచనలు ఉన్నాయి. వీరి బరువు అంత మోకాళ్ళపై పడుతుంది. వీరు తమ లావును తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. తగ్గిన లావును అలాగే ఉండేటట్లు చూసుకోవాలి. శరీరం బరువు పెరగకూడదు.

వీరికి అనుకున్న పనులు తొందరగా పూర్తికావు. కావున ఈ పని జరగాలి. ఇది చేయాలి అనే ఆలోచనలు రానీయకూడదు. ఒకవేళ వచ్చినా ఆ పనులు సాధించుకోవడం చాలా కష్టం అవుతుంది. సంతృప్తి తక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు సంపాదించాలి. అప్పుడే ఆ లాభం సంతృప్తిని ఇస్తుంది. ఎక్కువ శ్రమ తక్కువ ఫలితానికి అంత ఆనందం ఉండదు. దీనిని మేషరాశివారు తప్పనిసరిగా గమనించి మెలగాలి.

వీరు శని దోష నివారణకు రోజూ ప్రాణాయామాలు, యోగాసనాలు చేయడం, శివునికి అభిషేకం చేయడం తప్పనిసరి.   నువ్వుల నూనెతో మధ్య మధ్యలో తైలాభ్యంగన స్నానం చేయాలి.

డా.ఎస్.ప్రతిభ

 

click me!