వాస్తు ప్రకారం.. భోజనం చేసే సమయంలో ఈ నియమాలు పాటించాలి..!

Published : Feb 08, 2022, 04:04 PM IST
వాస్తు ప్రకారం.. భోజనం చేసే సమయంలో ఈ నియమాలు పాటించాలి..!

సారాంశం

వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను అనుసరించడం ద్వారా, మీరు విజయం, ఆనందాన్ని పొందవచ్చు. ముఖ్యంగా భోజనం చేసే సమయంలోనూ వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాస్తు మన జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. వాస్తు శాస్త్రంలో శుభ ,  అశుభాలు ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమిస్తాయి. వాస్తు శాస్త్రంలో, కొన్ని దిశలను శుభప్రదంగా పరిగణిస్తారు. కొన్ని పనులకు కొన్ని దిశలు అశుభంగా పరిగణిస్తారు. వాస్తు శాస్త్రంలో పేర్కొన్న నియమాలను అనుసరించడం ద్వారా, మీరు విజయం, ఆనందాన్ని పొందవచ్చు. ముఖ్యంగా భోజనం చేసే సమయంలోనూ వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

 ఈరోజుల్లో టీవీల ముందు కూర్చుని తినే అలవాటు ఎక్కువ అలవాటుగా మారింది. అయితే.. ఆడ్రీ వాస్తు ప్రకారం, ఎక్కడ పడితే అక్కడ   ఆహారం తీసుకోకూడదు.  దానికి దిశా నిర్దేశం ఉంది. భోజనం చేసేటప్పుడు ఎలాంటి వాస్తు నియమాలు పాటించాలో ,మీరు భోజనం చేసేటప్పుడు ఈ నియమాలను పాటిస్తే భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందో ఓసారి చూద్దాం..

మీరు ఏ దిక్కున కూర్చుని భోజనం చేసారు?

వాస్తు ప్రకారం తూర్పు, ఉత్తర దిక్కులలో కూర్చుని భోజనం చేయడం ఉత్తమమని భావిస్తారు. ఈ రెండు దిక్కులు దేవుడి నిలయంగా నమ్ముతుంటారు. మీరు తూర్పు లేదా ఉత్తరం నుండి ఆహారం తీసుకుంటే భగవంతుని అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. ఆయుర్దాయం పెరుగుతుంది.  

వ్యాధులు, మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
దక్షిణ దిశను యమన దిశగా పరిగణిస్తారు. కావున దక్షిణం వైపు  తలపెట్టి ఆహారము భుజించడం వల్ల దురదృష్టాన్ని తీసుకువస్తోంది. ఇది  ఆరోగ్యాన్ని మరింత దిగజార్చుతుంది. ఇంటికి వచ్చే అతిథులకు దక్షిణ లేదా పడమర భోజనం అందించాలి. తూర్పు లేదా ఉత్తరం వైపు భోజనం చేయాలని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది.

డైనింగ్ టేబుల్‌ని దక్షిణ లేదా పడమర గోడ వైపు ఉంచాలి. అక్కడ కూర్చొని తినడం వల్ల.. ఆరోగ్యం మెరుగుపడుతుంది.
విరిగిన, మురికి పాత్రలలో ఆహారాన్ని తినకూడదు. ఇది దురదృష్టాన్ని పెంచుతుంది. జీవితంలో కష్టాలను కలిగిస్తుంది.
మంచం మీద భోజనం చేయవద్దు. వాస్తు పరంగా ఇది మంచిది కాదు. ఎల్లవేళలా నేలపై ఆహారం తీసుకోవడం శాస్త్రానికి , ఆరోగ్యానికి రెండింటికీ మంచిది. రెండు కాళ్లు మడత పెట్టి కూర్చొని అంటే పద్మాసనం  వేసుకొని తినడం వల్ల అన్నపూర్ణ దేవి సంతోషిస్తుందట. 

భోజనం పూర్తైన తర్వాత..  డైనింగ్ టేబుల్ నుండి అన్ని పాత్రలను తప్పనిసరిగా తీసివేయాలి. మీరు తిన్న టేబుల్ లేదా స్థలాన్ని శుభ్రం చేయండి. ఇక భోజనం చేసే టప్పుడు మాట్లాడకూడదు. ప్రశాంతంగా భోజనం చేయాలి. 

PREV
click me!

Recommended Stories

Zodiac Signs: 2026 సంవత్సరంలో ఎక్కువగా డబ్బు సంపాదించే ఆరు రాశులు ఇవే!
Baba Vanga: 2026లో ఆ విప‌త్తు త‌ప్ప‌దా.? భ‌య‌పెడుతోన్న బాబా వంగా భ‌విష్య‌వాణి