నా జాతకంలో దోషాలు ఏమైనా ఉన్నాయా? పెళ్లి ఎప్పుడు అవుతుంది?

By ramya NFirst Published Feb 12, 2019, 9:42 AM IST
Highlights

మాకు పంపిన కొందరి జాతక వివరాలు ఇక్కడ ఉన్నాయి చూసుకోగలరు

దామోదర్‌

దోషాలు ఏమైనా ఉన్నాయా తెలుపగలరు?

ప్రస్తుతం సమయం అంత అనుకూలంగా లేదు. 2020 అక్టోబర్‌ వరకు అన్ని విషయాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఆలోచనల్లో తొందరపాటు పనికిరాదు.

మొత్తం మీద జీవితం ఆనందంగా ఉన్నప్పటికీ ప్రస్తుత థలు అనుకూలంగా లేనందున జాగ్రత్తగా ఉండడం అవసరం. ప్రస్తుతం ఆనందమయ జీవితం కోసం ఈ జపాలు దానాలు తప్పనిసరి.

జపం : మంగళం భగవాన్‌ విష్ణుః, మంగళం గరుడధ్వజ, మంగళం పుండరీకాక్ష, మంగళాయతనం హరిః

ఈ జపం నిరంతరం చేసుకుంటూ ఉండాలి. దీనితోపాటు సుబ్రహ్మణ్యారాధన, దుర్గాపూజలు కూడా చేసుకోవాలి.

దానాలు : 1. కందిపప్పు/ దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు, క్యారేట్,, బీట్ రూట్ 2. నూనె అవసరం ఉన్నవారికి ఇంటిలో వాడుకోవడానికి, దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి.

2. చంథ్రేఖర్‌

ప్రస్తుతం ఎలా ఉంది?

జులై 2019 వరకు థ అంత అనుకూలంగా లేదు. తరువాత అన్ని రకాలుగా బావుంటుంది. దూర ప్రయణాలు చేయడం, వ్యాపారాలు చేయడం శ్రేయోదాయకం అవుతాయి.

జులై వరకు వ్యాయామం, ప్రాణాయామం, యోగాసాలు చేస్తూ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వీరు నిరంతరం చేసుకోవాల్సిన జపం

జపం : శ్రీరామ జయరామ జయజయ రామరామ, శ్రీమాత్రేనమః అనే మంత్రాలు నిరంతరం చేసుకుంటూ ఉండాలి.

దానాలు :  1. కందిపప్పు/ దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు,  క్యారేట్,, బీట్ రూట్ 2. పశుపక్షాదులకు ఆహారం వేయడం తప్పనిసరి.

3. ప్రదీప్‌

ఉద్యోగం ఎలా ఉంది?

జాతకంలో ప్రస్తుతం అతి తీవ్ర సమస్యలు లేవు. 2020 జనవరి తర్వాత జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశాకాలు కనిపిస్తున్నాయి. బాగా పెంచుకోవాలి. మాటల వల్ల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా మ్లాడాలి. ఉద్యోగంలో మంచి ఉన్నతికోసం నిరంతరం చేసుకోవాల్సిన జపం.

జపం : శ్రీ రాజమాతంగ్యై నమః.

దానాలు :   1. కందిపప్పు/ దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు,  క్యారేట్,, బీట్ రూట్

4. మల్లేష్‌

పెళ్ళి భవిష్యత్తు వివరాలు తెలుపండి?

జన్మ నక్షత్రం మృగశిర 3వ పాదం, రాశి మిథునం. నామరాశి సింహం.

వివాహం చాలా ఆలస్యం అవుతుంది. వైవాహిక జీవితంలో కూడా సమస్యలు చాలా ఉంటాయి. బాగా జపం దానం   చేసుకుంటే తప్ప సరియైన, వైవాహిక జీవిత సౌఖ్యం లభించే అవకాశం లేదు.

2019 అక్టోబర్‌ తర్వాత ఆరోగ్యం విషయంలో మ్లాడే విషయంలో, మీ ప్రవర్తనలో అన్నిలో జాగ్గ్రతగా ఉండడం అవసరం.

జపం : కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

దానాలు : 1. కందిపప్పు/ దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు, క్యారేట్,, బీట్ రూట్ 2. నూనె అవసరం ఉన్నవారికి ఇంటిలో వాడుకోవడానికి, దేవాలయాల్లో దీపారాధనకు వినియోగించాలి.

5. అశోక్‌ కుమార్‌

ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? వివాహం ఎప్పుడు అవుతుంది.

ప్రస్తుతం ఉన్న శుభసమయం 13 ఏప్రిల్‌ 2019 నుంచి 31 జులై 2019 వరకు. ఈ సమయం ఉద్యోగానికి మరియు వివాహానికి అనుకూల సమయం. ఆ తర్వాత మళ్ళీ శుభ సమయం 2020 నవంబర్‌ తర్వాత మొదలౌతుంది.

వీరు అధికంగా జపం దానాలు చేసుకోకపోతే జీవితంలో అనేక కష్టనష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది.

జపం. కల్యాణాద్భుతగాత్రాయ కామితార్థ ప్రదాయినే శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం

శ్రీ రాజమాతంగ్యై నమః జపం నిరంతరం చేసుకోవాలి.

దానాలు : 1. కందిపప్పు/ దానిమ్మపళ్ళు / ఖర్జూరాలు, క్యారేట్,, బీట్ రూట్ 2. నూనె అవసరం ఉన్నవారికి ఇంటిలో వాడుకోవడానికి, 3. ఇడ్లీ, వడలు, మినప సున్ని ఉండలు, 4. అన్నదానం మంచిది.

6. శ్రీనివాస్‌ మల్లవరపు

మీరు మీ వివరాలు పూర్తిగా పంపలేదు. సమస్య ఏమిో కూడా తెలుపలేదు. పూర్తి జాతకం చెప్పడానికి ఇది వేదిక కాదు కాబట్టి.. మీ ప్రస్తుత సమస్యను మాత్రం తెలియజేయండి

డా.ఎస్.ప్రతిభ

click me!