ఫోన్ కాల్ కి ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారు..?

Published : Mar 24, 2022, 11:35 AM IST
 ఫోన్ కాల్ కి ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతారు..?

సారాంశం

ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. ఫోన్ లతోనే గడుపుతున్నారు. కాగా... ఫోన్ మోగిన ప్రతిసారీ...  ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఓసారి చూద్దాం..

ప్రస్తుతం ప్రతి ఒక్కరి జీవితంలో స్మార్ట్ ఫోన్ లు భాగమైపోయాయి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు.. ఫోన్ లతోనే గడుపుతున్నారు. కాగా... ఫోన్ మోగిన ప్రతిసారీ...  ఏ రాశివారు ఎలా రియాక్ట్ అవుతున్నారో ఓసారి చూద్దాం..

1.మేష రాశి..
ఈ రాశివారు  చాలా చురుకుగా ఉంటారు. కానీ ఫోన్ వచ్చినప్పుడు మాత్రం  పెద్దగా ఆసక్తి చూపించరు. రోబో మాదిరిగా..  మాట్లాడతారు. తమకు ఇష్టమైన వారితో తప్ప.. మిగితా ఎవరితోనూ వీరు ఆసక్తిగా మాట్లాడరు.

2.వృషభ రాశి..
ఈ రాశివారు చాలా సింపుల్, స్వీట్ గా ఉంటారు. వీరు ఫోన్ లో చాలా  ప్రేమగా హలో అంటూ మాట్లాడతారు.

3.మిథున రాశి..
ఈ రాశివారు.. ఇతరుల నుంచి ఫోన్ లో మాట్లాడటానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. చాలా ఉత్సాహంగా మాట్లాడతారు.

4.కర్కాటక రాశి..
ఈ రాశివారు కొంచెం డ్రమటిక్ గా ఆలోచిస్తారు. Helooooooo అంటూ సాగదీసి చెప్పేస్తారు.

5.సింహ రాశి..
ఈ రాశివారు.. ముందుగా.. ఎదుటి వారి నుంచి హలో వినాలి అని అనుకుంటారు. వీరికి ఎక్కువ మందితో స్నేహం చేయడం అంటే చాలా ఇష్టం.

6.కన్య రాశి..
ఈ రాశివారు ఎక్కువగా ఎప్పుడూ సీరియస్ గా ఉంటారు. కాబట్టి.. షార్ట్ అండ్ సింపుల్ గా హలో అని చెప్పేస్తారు.

7.తుల రాశి..

ఈ రాశివారు తరచూ ఫోన్లు మారుస్తూ ఉంటారు. కాబట్టి నెంబర్లు సేవ్ చేసుకోరు. ఈ క్రమంలో... ఎవరు ఫోన్ చేసినా ఎవరు అని అడిగేస్తూ ఉంటారు.

8.వృశ్చిక రాశి..
ఈ రాశివారు హ్యాపీగా ఉంటే హలో అని చెబుతారు. అదే మూడ్ సరిగా లేకపోతే.. ఏం కావాలి..? అని అడుగుతారు.

9.ధనస్సు రాశి..
ఈ రాశివారికి కాస్త తిక్క ఎక్కువ. ఫోన్ చేసింది ఎవరు అని తెలిసినా కూడా.. ఎవరు మాట్లాడేది అని అడుగుతూ ఉంటారు.

10.మకరరాశి..
ఈ రాశివారు నిత్యం చాలా బిజీగా ఉంటారు. కాబట్టి.. ఏదైనా ఇంపార్ట్ ఉంటే మాత్రమే ఫోన్ మాట్లాడతారు. ఊరికే సోది పెట్టడం వీరికి నచ్చదు.

11.కుంభ రాశి..
ఈ రాశివారు కొంచెం బిజీగా, మూడీగా ఉంటారు. అందుకే ఫోన్ లిఫ్ట్ చేసి.. చెప్పండి.. ఏం కావాలి అంటూ మాట్లాడతారు.

12.మీన రాశి..
ఈ రాశివారికి ఫోన్ మాట్లాడటం కూడా పెద్దగా నచ్చదు. అందుకే.... కనీసం ఫోన్ చేసినా లిఫ్ట్ కూడా చేయరు.

PREV
click me!

Recommended Stories

Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారితో జాగ్రత్త… పైకి చాలా మంచివారిలా కనిపిస్తారు!
Elinati Shani: ఈ రాశులకు శని పీడ తప్పదా? ఎక్కువ కష్టాలు పడేది వీరే..!