Ugadi 2022: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో కన్య రాశివారి జాతకం..!

By telugu news teamFirst Published Mar 29, 2022, 4:08 PM IST
Highlights

శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాదిలో కన్య రాశివారికి   2023 ఫిబ్రవరి వరకు పంచమ భావంలో ఉండడం వలన అన్ని విద్యార్హతలు ఉన్ననూ ప్రమోషన్ల విషయంలో జాప్యం జరుగుతుంది. ఇంటి లోని శుభ కార్యాలు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి.

కన్యారాశి ( Virgo) ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాల వారికి


కన్యరాశి  వారికి‘శుభకృత' నామ సంవత్సరంలో ఆదాయం -11, వ్యయం - 05  

రాజపూజ్యం  - 4, అవమానం - 5  

* గురుగ్రహ ఫలితాలు :- 6 ఏప్రిల్ 2022 వరకు ఆరవ రాశిలో ఉండి 7 ఏప్రిల్ 2022 నుండి సంవత్సరం చివరి వరకు సప్తమ రాశి సంచారం చేయును. ఆరవ భావంగా కుటుంబ సభ్యుల వలన మన:శాంతి లోపం ఏర్పడుతుంది. ఉదర సంబంధమైన అనారోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించును. ఇక సప్తమ భావ ఫలితాల్లో ఆనింట్లో అనుకూలం. కుటుంబ సమస్యలు తీరుస్తారు. పుణ్యాక్షేత్ర సందర్శనం చేస్తారు. భూములు, వాహన కొనుగోలు చేసే యోగం ఏర్పడుతుంది.   
 
* శని "దేవుని" గ్రహ ఫలితాలు:- 2023 ఫిబ్రవరి వరకు పంచమ భావంలో ఉండడం వలన అన్ని విద్యార్హతలు ఉన్ననూ ప్రమోషన్ల విషయంలో జాప్యం జరుగుతుంది. ఇంటి లోని శుభ కార్యాలు వాయిదా పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీ స్తోమతకు తగని వారితో వైరాలు ఏర్పడే అవకాశాలు సూచిస్తున్నాయి. శని షష్టమ భావంలో ప్రవేశం చేనప్పటినుండి స్టిరాస్తులు అభివృద్ధి చెందును. వ్యాపారం చేయాలనుకునే వారు కొత్త వ్యాపారాలు స్వతంగా ప్రారంభించుకుంటారు, లేదా భాగస్వామ్య వ్యాపారాలు చేస్తారు.   

* రాహువు ఫలితాలు:- 15 ఏప్రిల్ 2022 నుండి అష్టమ భావంలో సంచారం వృత్తుల యందు ప్రతి బంధకములు. భాగస్వామ్య వ్యాపారాలలో నష్టాలు. తరచుగా ప్రయాణాలు, ఆందోళనలు .  

* కేతువు ఫలితాలు:-  విదేశీ ప్రయాణముల వారికి కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి. పుణ్య క్షేత్ర సందర్శనం. చేసే సత్కార్యాలలో గౌరవం దక్కుతుంది. ఆదాయ వనరులు పెరుగుతాయి. 15 ఏప్రిల్ 2022 నుండి కేతువు ద్వితీయ సంచారం వలన శత్రుభీతి అవమానలను ఎదుర్కోవలసి వస్తుంది.  

శని గ్రహం వల్ల మిశ్రమ ఫలితాలొస్తాయి. 

రాహువు వల్ల కూడా ప్రతికూల ఫలితాలొస్తాయి. 

కేతువు వల్ల చెడు ఫలితాలు రావొచ్చు.

విద్యార్థులు శ్రద్ధగా చదివితే మంచి ర్యాంక్ లభిస్తుంది. శుభప్రదంగా ఉంటుంది.

వ్యవసాయ దారులకు అనుకూలంగా ఉంది. 

చాలా లాభావంతమైన ఫలితాలు వున్నాయి. 

ఎక్కువగా శుభ వార్తలే వింటారు. 

శత్రువులు ఎక్కువవుతారు. 

మీ గురించి చెడు ప్రచారాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఎక్కడ, ఎప్పుడు నోరు జారకండి. ఎక్కడి మాటలు అక్కడే వదిలివేయండి. 

అనవసరమైన స్నేహాలు, అలవాట్ల వలన ప్రమాదం పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త.  

వచ్చిన డబ్బుతో స్థిరాస్థులు కొంటే మంచిది. 

తొందరపాటుతనం మానుకోవాలి. 

జూన్ జులై ఆగష్టు మాసాలలో జాగ్రత్తగా వుండండి. 

రాజకీయ నాయకులకు పదవిప్రాప్తి. 

ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు లభిస్తాయి. 

వ్యాపారస్తులు లాభాలను ఘటిస్తారు, స్టాక్ ఎక్కువ నిల్వలు ఉంచుకునుట ఉత్తమం. 

అనుకూలమైన శుభ ఫలితాలు పొందుటకు లలితా సహస్ర నామ పారాయణం చేస్తే మంచిది. ఇంట్లో, వ్యాపార సంస్థలలో ప్రధాన ద్వారం లోపలి వైపు గుమ్మం పై భాగంలో గోమాత సహిత ఐశ్వర్యకాళీ అమ్మవారి పటం భోజపత్ర యంత్ర యుక్తంగా ఉన్న పటాన్ని ఏర్పాటు చేసి రోజు ఎర్రని పూలతో నిష్టగా పూజిస్తే సకల సంపదలతో పాటు వాస్తు దోషం, దృష్టి దోష నివారణ కల్గుతుంది. గోమాతకు గ్రాసం, పక్షులకు ధాన్యం, త్రాగడానికి నీళ్ళను ఏర్పాటుచేసిన వారికి ఈతి బాధలు తొలగి గ్రహ అనుకూలతలు కలుగుతాయి... సర్వేజనా సుఖినో భవంతు, లోకాస్సమస్తా స్సుఖినోభవంతు..   ఓం శాంతి శాంతి శాంతి: .. మీ ~ డా.ఎం.ఎన్.ఆచార్య
 

డా. యం. ఎన్. ఆచార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151

గమనిక :- ప్రస్తుతకాల గోచార స్థితి, దశాంతర్ధశ , ద్వాదశ భావలు, వాటిపై దృష్టులు, ఉచ్చ నీచ స్థానాలు, షడ్బలాలు, యుతులు, పరివర్తనలు, గ్రహ అవస్తాలు..  మొదలగు అనేక అంశాలను, అలాగే అన్ని రంగాల, వర్గాల వారిని దృష్టిలో పెట్టుకుని ఇందులో కేవలం సామూహిక ఫలితాలను మాత్రమే తెలియజేయడం జరుగుతున్నది. ఈ ఫలితాలు మొత్తం తమ ఒక్కరికే వర్తిస్తాయని భావించవద్దు. పేరుతో రాశి ఫలితాలు చూసుకోవడం అనేది సరైన పద్దతి కాదు, ఇది గమనించగలరు. సరైన పుట్టిన తేదీ, సమయం ఆధారంగా జాతక విశ్లేషణలో సరైన ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఆసక్తి కలవారు మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ కొరకు అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి వారికి దక్షిణ, తాంబూలాదులనిచ్చి మీ జాతక వివరాలను, తరుణోపాయలను అడిగి తెలుసుకుని శుభ ఫలితాలను పొందగలరు. . డా.ఎం.ఎన్.ఆచార్య 

click me!