2020లో మీనరాశి వారికి ఎలాంటి భవిష్యత్ ఉంటుంది. ఎలాంటి లాభాలు ఉంటాయనే సమగ్ర వివరాలను తెలుసుకొండి...
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : వీరికి చేసే పనుల్లో శ్రమ ఉంటుంది. చాలా ఒత్తిడి ఉంటుంది. లాభాల ద్వారా సమాజంలో గౌరవాన్ని పెంచుకుంటారు. గుర్తింపుకోసం ఆరాటపడతారు. మాటలవల్ల గుర్తింపు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో బాధ్యతలు పెంచుకుంటారు. నిల్వ ధనాన్ని పెంచుకుంటారు. చేసే అన్ని పనుల్లో శారీరక శ్రమ ఉంటుంది.
కళాకారులకు అనుకూలత పెరుగుతుంది. తాను చేసే శ్రమవల్ల లాభాలు పెంచుకుంటారు. విశ్రాంతిని కోల్పోతారు. అనవసర వ్యయం ఉంటుంది. దూర ప్రయాణాలు చేసే ఆలోచనలు ఉంటాయి. కళాకారులకు అనుకూలత ఉంటుంది. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. ఉపాసనను పెంచుకునే ప్రయత్నం చేయాలి. ఖర్చులు పెడితేనే వీరికి ఆదాయం ఉంటుంది. లాభాలు ఉపయోగపడతాయి.
undefined
సంతాన ఆలోచనల్లో ఒత్తిడి ఉంటుంది. మానసిక ప్రశాంతత కరువౌవుతుంది. చిత్త చాంచల్యం పెరుగుతుంది. సృజనాత్మకతను కోల్పోతారు. పరిపాలన సమర్ధత తక్కువగా ఉంటుంది. తాను అనుకున్నది ఒక్కటి అక్కడ జరిగేది మరో రకంగా ఉంటుంది. సెప్టెంబరు తరువాత సౌకర్యాలు ఒత్తిడికి గురిచేస్తాయి. వాటి పై దృష్టి చాలా పెరుగుతుంది. కాని వాటి జోలికి వెళ్ళకూడదు. తాను సుఖపడాలనే ఆలోచనను తగ్గించుకోవాలి.
జ్యోతిషం: 2020లో మీ రాశిఫలాలు ఇలా ఉన్నాయి
లాభాలు ఒత్తిడిని కలిగిస్తాయి. వచ్చిన లాభాల్లో సంతృప్తి ఉండదు. నిరాశ, నిస్పృహలు పెరుగుతున్నాయి. కళాకారులకు అంత అనుకూలం కాదు. తమకు ఏమీ రాదనే నిరాశ ధోరణినుంచి బయటికి రావాలి. ఆశను పెంచుకుంటూ బ్రతకడం అలవాటు చేసుకోవాలి.
వీరు పవుపక్షాదులకు ఆహారం వేయడం, నీరు పెట్టడం, యోగా ప్రాణాయామాలు చేయడం, వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలి. గురువులను సత్కరించుకోవాలి. విద్యార్థులకు పుస్తకాలు పంచిపెట్టాలి. శనగలు, దానం చేయాలి. పసుపురంగు, నీలిరంగు, చిత్రవర్ణం వస్త్రాలను దానం చేయాలి.
2020లో మీ రాశి పలాలు ఎలా ఉన్నాయో తెలుసుకొండి!