తుల రాశిపై గురుగ్రహ ప్రభావం ఎలా ఉంది?

By ramya neerukondaFirst Published Dec 5, 2018, 3:09 PM IST
Highlights

దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి. సాయిబాబా గుడికి ప్రతి గురువారం తప్పకుండా వెళ్ళి తీరాలి. గురువారాలు ఉపవాసాలు చేయడం మంచిది.శనగపప్పు, శనగపిండి, అన్ని రకాల తీపి పదార్థాలు దానం చేయడం తప్పనిసరి. వీరు ప్రత్యక్ష గురువులను నిరంతరం కలుసుకుంటూ ఉండాలి.

వీరికి కుటుంబంలో గౌరవం లభిస్తుంది. కుటుంబంలో అనుకూలత పెరుగుతుంది. మర్యాదలు పెరుగుతాయి. మాట విలువ పెరుగుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. మధ్యవర్తిత్వాలు ఉపయోగపడతాయి. నిల్వ ధనాన్ని పెంచుకుటాంరు. స్థిరాస్తులను పెంచుకునే ఆలోచన ఉంటుంది. గృహనిర్మాణాలపై దృష్టి ఉంటుంది. కొంత కష్టంతో ఫళిత సాధన ఉంటుంది. విద్యార్థులు ఎంత శ్రమపడితే అంత ఫలితాన్ని సాధిస్తారు.

వీరికి పోటీలు అధికంగా ఉంటాయి. వాటిని తట్టుకునే శక్తి తక్కువగా ఉంటుంది. శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగిన గుర్తింపు ఉండదు. తమకు అవసరం లేని విచారాలన్నీ తమ చెంతకు వస్తాయి. అనారోగ్య భావన ఉంటుంది. శత్రువులపై విజయానికి తపిస్తారు. విద్యార్థులకు కష్టకాలం. పోటీ పరీక్షల్లో శ్రమ అధికంగా చేయాలి. అన్ని పనుల్లో ఒత్తిడి ఉంటుంది. శరీరంపై దృష్టి అధికంగా పెడతారు.

అనుకోని ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి. స్నేహితులతో ఒత్తిడి అధికంగా ఉంటుంది. ప్రతీ పనిలోను ఆటంకాలు ఉంటాయి. ఇతరులపై ఆధారపడతారు. అవమానాలు వచ్చే సూచనలు. అనుకోని ఆదాయాలు వచ్చే సూచనలు. దాని వలన తమ అనుకునేవారు దూరమౌతారు. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.

ఉద్యోగస్తులకు చేసే ఉద్యోగంలో ఒత్తిడి తప్పదు. తోటివారి సహాయ సహకారాలు కూడా తొందరగా అందవు. సంఘంలో గౌరవంకోసం ఆరాట పడతారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకోవాలనే ఆలోచన ఉంటుంది. శారీరక బలాన్ని వృద్ధి చేసుకుటాంరు.   అధికారం, హోదా, హుందాతనం ఉండాలని కోరుకుటాంరు. గౌరవ భంగం కలిగే సూచనలు ఉంటాయి. చేసే వృత్తులలో ఆటంకాలు ఎదురౌతాయి. ఇతరులపై ఆధారపడతారు.

విద్యార్థులకు అధిక శ్రమ ఉన్నప్పుడు దానికోసం కష్టపడడం తప్పనిసరి. కష్టపడినా ఫలితం రాకపోతే ఒక్కక్షణం ఆలోచించాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదు. శ్రమకు తగిన గుర్తింపు ఉండకపోవచ్చు. వీరు రోజూ యోగాసనాలు వేయడం మంచిది. ఆహారం బాగా నమిలి తినాలి. లేకపోతే అజీర్ణి సమస్యలు వచ్చే సూచనలు ఉంటాయి.

అనుకోని ఆదాయాలు ఉంటాయి కాబట్టి వాటినుంచి తమను తాము జాగ్రత్తగా కాపాడుకోవాలి. వచ్చిన ఆదాయం తమది కాదు అనుకొని ఎక్కువగా దానాలు చేస్తూ ఉండాలి. తమకు ఎవరు దగ్గరైనా ఆదాయాల వల్ల ఇబ్బందులు వస్తాయి. జాగ్రత్త అవసరం.

కీర్తి ప్రతిష్టలకు ఆటంకం ఏర్పడుతుంది అనుకున్నప్పుడు వాటిని కాపాడుకోవడానికి జాగ్రత్త పడాలి. ఉన్న స్థితి నుంచి కింద పడకుండా జాగ్రత్త పడాలి. ఉన్నత స్థితికి చేరుకోకున్నా పర్వాలేదు. కాని ఉన్నదానికంటే తక్కువ కాకుండా చూసుకోవాలి.

వీరు దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలి. సాయిబాబా గుడికి ప్రతి గురువారం తప్పకుండా వెళ్ళి తీరాలి. గురువారాలు ఉపవాసాలు చేయడం మంచిది.

శనగపప్పు, శనగపిండి, అన్ని రకాల తీపి పదార్థాలు దానం చేయడం తప్పనిసరి. వీరు ప్రత్యక్ష గురువులను నిరంతరం కలుసుకుంటూ ఉండాలి.

 

click me!