మేషరాశిపై గురుగ్రహ ప్రభావం..?

By ramya neerukondaFirst Published Nov 27, 2018, 2:42 PM IST
Highlights

ఎక్కువగా ప్రకృతిని కాపాడే పనులు అనగా రావి, వేప, మారేడు చెట్లు నాటించడం, అనాధ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, విద్యార్థులకు, గురువులకు స్వ్స్‌ీ ఇవ్వడం, దేవాలయాల్లో శనగలు ప్రసాదంగా ఇవ్వడం, అవసరమైనవారికి శనగపప్పు, పిండి దానం చేయాలి.

వీరు మాట్లాడే మాటల వల్ల వీరికి ఒత్తిడి పెరుగుతుంది. అపార్థాలు పెరుగుతాయి. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అధిక శ్రమతో వాటిని సాధిస్తారు. గృహనిర్మాణ పనులు శ్రమతో పూర్తిచేస్తారు. అనుకున్నంత సులువుగా ఉండవు.   మధ్యవర్తిత్వాల జోలికి వెళ్ళరాదు. గృహ, వాహన, ఆహార సౌకర్యాలు పొందడం కోసం అధిక శ్రమ పడతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ప్రమాదాలకు సూచన. విందు భోజనాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. అనారోగ్య సమస్యలు, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం. ఆహారంలో సమయపాలన అవసరం. మితాహారం మంచిది.

అనవసర ఖర్చులు చేస్తారు. వాటి వల్ల ఒత్తిడి ఉంటుంది. పరామర్శల్లో లోపాలు ఉంటాయి. వ్యాపారస్తులు జాగ్రత్త వహించడం మంచిది. అనుకోని ఆటంకాలు వచ్చే సూచనలు. ఇతరులపై ఆధారపడతారు. వైద్యశాలలను సందర్శిస్తారు. ఆధ్యాత్మిక చింతనపై కొంత దృష్టి పెడతారు. ఆధ్యాత్మిక యాత్రలు చేయాలనే తపన బాగా ఉంటుంది. విద్యార్థులు అధిక శ్రమతో తక్కువ ఫలితాల సాధన ఉంటుంది. శ్రమకు తగిన ఫలితం ఉండదు. పరిశోధకులు జాగ్రత్త వహించాలి. సంతృప్తి లోపం ఉంటుంది.

విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. శారీరక ఇబ్బందులకు సూచనలు. మానసిక ఒత్తిడి తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. పాదాల నొప్పులు ఉంటాయి. పరాధీనత ఉంటుంది. అన్ని పనులు అనుకున్నంత వేగంగా ముందుకు నడువవు. ప్రతి పనిలోను జాప్యం పెరుగుతుంది. ఏ పని సాధించినా మొదట శ్రమ, ఒత్తిడి అధికంగా ఉండి అనంతరం ఫలిత సాధన ఉంటుంది.

పైన చెప్పిన లోపాలు ఈ రాశివారికి ఉంటాయని తెలుసుకొని వాటిని నివారించుకునే ప్రయత్నం చేయాలి. వీరికి మాటల వల్ల ఒత్తిడి, ఇబ్బంది ఉంటుందని తెలుసుకొని తక్కువగా మ్లాడడం ఎక్కువగా వినడం చేయాలి. వినేటప్పుడు కూడా నిరంతరం శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది. అవసరమైనప్పుడు మాత్రమే మ్లాడాలి. దానివల్ల అపార్థాలు రాకుండా ఉంటాయి. మధ్యవర్తిత్వాలు చేయకూడదు.

ప్రయాణాల్లో ఒత్తిడి ఆటంకాలు ఉంటాయి కాబ్టి వీరు ప్రయాణం చేసే ముందు గచ్ఛ గౌతమ శీఘ్రంమే ప్రయాణం సఫలంకురు ఆసనం శయనం యానం భోజనం తత్ర కల్పయ అనే మంత్రాన్ని జపించుకుంటూ ప్రయాణం చేయాలి. దీని వలన వెళ్ళినచోట తమకు కావలసిన సౌకర్యాలు లభిస్తాయి. ఆహారం తీసుకునే సమయంలో జీర్ణం జీర్ణం వాతాపిజీర్ణం అనే మంత్రాన్ని జపించుకుంటూ ఆహారం తీసుకోవడం వల్ల తీసుకున్న కొద్ది ఆహారం కూడా తొందరగా జీర్ణం అయి అజీర్ణ సమస్యలు రాకుండా కాపాడుకోవచ్చు.

అనవసర ఖర్చులు ఉంటాయని తెలుసుకున్నప్పుడు ముందుగానే వాటిని దాన ధర్మాలకు వినియోగించాలి. వీరు ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ప్టోలి. వాటిలో కొంత మనశ్శాంతి లభిస్తుంది. జీర్ణోద్ధరణ దేవాలయకు వారికి చేతన సహకారం అందించాలి. ఎక్కడైనా హోమాలు జరుగుతుంటే ఆవునెయ్యి ఇవ్వడం మంచిది. ప్రకృతిని కాపాడే పనులు చేయాలి. హాస్పిటల్‌లో ఉన్నవారంతా తొందరగా ఆనందంగా ఇంటికి వెళుతున్నట్లు మనసులో భావన చేస్తూ వారికి పళ్ళు ఇస్తున్నట్లుగా ఊహించుకోవాలి.

విశ్రాంతి తక్కువగా ఉంటుంది కాబ్టి దైవకార్యక్రమాలు నిరంతర జపం చేయడం వల్ల రాత్రి కొంతసేపు నిద్రపోయినా కాని అలసట భావన ఉండదు. పడుకునేముందు కూడా జపం చేస్తూ పడుకోవాలి. పనులు మొదలుపెట్టేముందు ఇష్టమైన భగవన్నామ స్మరణ మంచిది. నిరంతరం జపం చేస్తూ పనులను పూర్తిచేయాలి.  వీరు ఎక్కువగా ప్రకృతిని కాపాడే పనులు అనగా రావి, వేప, మారేడు చెట్లు నాటించడం, అనాధ శరణాలయాలకు, వృద్ధాశ్రమాలకు, విద్యార్థులకు, గురువులకు స్వ్స్‌ీ ఇవ్వడం, దేవాలయాల్లో శనగలు ప్రసాదంగా ఇవ్వడం, అవసరమైనవారికి శనగపప్పు, పిండి దానం చేయాలి.

గురుసంబంధ ఆలయాలకు ఎక్కువగా వెళుతూ అక్కడి సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండడం వలన వీరు అనుకున్న పనుల్లో విజయం సాధించగలుగుతారు. పనుల్లో మొదట ఒత్తిడి ఉన్నా తరువాత విజయం సాధిస్తారు. ఈ పనులు చేస్తూ ఉండడం వలన శ్రమానంతరం ఫలితం ఉంటుంది.

డా.ఎస్.ప్రతిభ

click me!