దేవీ నవరాత్రులు... భవానీ దేవి అలంకారంలో అమ్మవారు

By telugu teamFirst Published Oct 2, 2019, 9:59 AM IST
Highlights

ఈ విశ్వానికి శ్రేయస్సును, ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలని ప్రార్థించాలి. మనకు మన ఇంట్లోని వారికి అందరికీ ఎలాటి రోగాలు లేకుండా చేయుగాక అని ప్రార్థించాలి.

మహాకాళీ మహాలక్ష్మీ మహాసారస్వతీ ప్రభా ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ విశ్వశ్రీః విశ్వమంగళమ్‌

                                షోడశీ పూర్ణ చంద్రాభా మల్లికార్జున గేహినీ ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ జగన్నీరోగ శోభనమ్‌

                                జగద్ధాత్రీ లోకనేత్రీ సుధా నిష్యంది సుస్మితా ఇష్టకామేశ్వరీ కుర్యాత్‌ లోకం సద్బుద్ధి సుందరమ్‌

                                పరమేశ్వర వాల్లభ్య దివ్య సౌభాగ్య సుప్రభా ఇష్టకామేశ్వరీ దద్యాత్‌ మాంగల్యానంద జీవనమ్‌

ఈ నాల్గవ రోజు అమ్మవారు భవాని అలంకారంలో మనకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారు అందరినీ చల్లగా కాపాడే తల్లి ఈ అమ్మవారు. ప్రతీ ఒక్కరికి ఇచ్చాశక్తి, క్రియా శక్తి, జ్ఞాన శక్తి అనే మూడు రకాల శక్తులు మనకు ఉంటాయి. ఈ మూడు శక్తులను ఏకీ కృతం చేసుకోవడమే మన పని.

ఈ విశ్వానికి శ్రేయస్సును, ఆనందాన్ని కలిగించే విధంగా ఉండాలని ప్రార్థించాలి. మనకు మన ఇంట్లోని వారికి అందరికీ ఎలాటి రోగాలు లేకుండా చేయుగాక అని ప్రార్థించాలి.

పురాణాల కథలను బట్టి, పూజా విధానాలను బట్టి నవరాత్రులు అందరికీ శక్తిని ఆరాధించేవైనప్పికీ, ప్రత్యేకంగా విజయథమి క్షత్రియుల పండుగ అని తెలుస్తుంది. రాజులు యుద్ధాలకు వెళ్ళే కాలంలో చేసుకునే ఉత్సవంగా ప్రారంభమైన ఈ పండుగ కాలక్రమంలో ఆయా వృత్తుల వారు తమ అభ్యుదయాన్ని, జయాన్ని కాంక్షిస్తూ వారి వృత్తికి సంబంధించిన వస్తువులను పూజించే ఆచారం ఏర్పడింది.

ఈ రోజు అమ్మవారిని పూజించడం వలన ఎవరికి కావలసిన కామితార్థాలను వారు నెరవేర్చుకోవచ్చు. కామితార్థాలు అనగా తమకు కావలసిన కోరికలు నెరవేర్చుకోవడం. కోరికలు లేకుండా ఎవ్వరూ కూడా ఉండరు. మానవులు అన్నాక సహజంగా ప్రతీ ఒక్కరికీ ఏవో ఒక రకమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటివల్ల వాటిని తీర్చుకోవడానికి ఏదో ఒక ప్రతయ్నం ఎప్పుడూ సాగుతూ ఉంటుంది.

పంచభూతాలను, ప్రకృతిని ఆరాధించడం, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలైన హరిషడ్వారాలను జయించడం  లాటి ఎన్నో విషయాలు పూర్తి కావాల్సి ఉంది. కొంతమంది విపరీతమైన మొండితనంతో ఉండి తమను తాము మార్చుకోవడానికి ఇష్టం లేక బలవంతంగా మార్చుకోవాల్సి వచ్చే సమయంలో బాధపడుతూ మార్చుకోవడం ఇలా ఎన్నో రకాలుగా ఉంటాయి.

వాటన్నినీ ఎవరికి వారు మార్చుకునే ప్రయత్నం చేయడమే ఈ శక్తి ఆరాధన. తమకు లేని శక్తిని, తమకు ఇవ్వమని ప్రార్థించడం. అలాగే తమలో ఉండే దుర్గుణాలను, అనగా రాక్షస గుణాలను తగ్గించమని చెప్పడం కోసం, తమకు కావాల్సిన మంచి గుణాలు ఎప్పికీ తమ దగ్గరే ఉండేలా కోరుకోవడం. కావాల్సిన మంచి గుణాలు అనగా దేవతలుగా ఎప్పుడూ నిత్యం ఆరాధించబడడం, పూజింపబడడం చేయాలి.

ఆధ్యాత్మిక జ్ఞానం, లౌకిక జ్ఞానం కావాలని కోరుకోవడం మొదలైనవి.

ఈ రోజు అమ్మవారి నైవేద్యం శాకాన్నం.

డా.ఎస్. ప్రతిభ

click me!