
వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రమే. ఉద్యోగంలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. చేపట్టిన పనుల్లో స్వల్ప ఆటంకాలు వస్తాయి. సోదరులతో మనస్పర్థలు కలుగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి.
సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వాహనయోగం ఉంది. సన్నిహితులతో సఖ్యతగా ఉంటారు. వ్యాపారాల్లో అభివృద్ధి ఉంటుంది. దైవదర్శనం చేసుకుంటారు. ఉద్యోగంలో అనుకూల వాతావరణం ఉంటుంది.
ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. మిత్రుల నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. దూరప్రాంతాల వారి నుంచి శుభవార్తలు వింటారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూలం.
దూరపు బంధువులతో మాటపట్టింపులు వస్తాయి. పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యమైన వ్యవహారాల్లో శ్రమ పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడి అధికమవుతుంది. ఊహించని ఖర్చులు వస్తాయి.
వృథా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఇంటా బయట చికాకులు పెరుగుతాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది. ఆరోగ్యం అంతగా సహకరించదు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం తప్పదు.
సన్నిహితులతో ఇంట్లో సంతోషంగా గడుపుతారు. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త కార్యక్రమాలు చేపట్టి లాభం పొందుతారు. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు ఆశించిన రీతిలో సాగుతాయి. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
స్థిరాస్తి సంబంధిత ఒప్పందాలు వాయిదా పడతాయి. వ్యాపారంలో నిరాశ తప్పదు. పనుల్లో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఉద్యోగాల్లో ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రయాణాలు కలిసిరావు.
కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు.
బంధు మిత్రుల నుంచి ఊహించని మాటలు వినాల్సి వస్తుంది. చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది. కుటుంబ బాధ్యతలు పెరిగి ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా ఉంటాయి. అనుకున్న టైంకి డబ్బు అందక ఇబ్బంది పడతారు.
ప్రముఖులతో చర్చలు లాభదాయకం. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. కొత్త ప్రయత్నాలు అనుకూల ఫలితాన్నిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఒడిదుడుకులు అధిగమిస్తారు. రుణ సంబంధిత ఇబ్బందుల నుంచి బయటపడతారు.
డబ్బు పరంగా ఇబ్బందులను అధిగమించి ముందుకు సాగుతారు. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. చిన్ననాటి మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారాల విస్తరణకు అవరోధాలు తొలగిపోతాయి. నిరుద్యోగులకు అనుకూలం. విద్యార్థుల కష్టం ఫలిస్తుంది.
ఊహించని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో అకస్మాత్తుగా మార్పులు చోటు చేసుకుంటాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు వస్తాయి.