ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 16.04.2025 బుధవారానికి సంబంధించినవి.
అన్నదమ్ములతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. వృత్తి, ఉద్యోగాల్లో వివాదాలు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. నిరుద్యోగులకు అనుకూలం.
చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. బంధు మిత్రులతో ఉన్న వివాదాలను పెరగకుండా చూసుకోవడం మంచిది. నిరుద్యోగులకు ఊహించని విధంగా అవకాశాలు వస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగాలు సాధారణం.
కుటుంబ సభ్యులతో కష్ట సుఖాలు పంచుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో ఇతరుల నుంచి సమస్యలు ఎదురవుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. వాహన ప్రయాణాల్లో నిదానంగా వ్యవహరించాలి.
అన్నదమ్ములతో భూమి వివాదాలు తొలగిపోతాయి. కీలక వ్యవహారాల్లో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. ఆర్థిక పరిస్థితి కొంత సానుకూలంగా ఉంటుంది.
కొన్ని పనుల్లో స్వల్ప అవరోధాలు వచ్చినప్పటికీ అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. దూర ప్రయాణాలు లాభదాయకం. మిత్రులతో చాలా కాలంగా ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు ఉన్నత అవకాశాలు వస్తాయి.
కుటుంబ సభ్యులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు అనుకూలం. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలం. పిల్లలకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. బంధు మిత్రుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు.
బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది. స్థిరాస్తి వివాదాలు తీరి కొత్త ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేసి ఇబ్బందులకు లోనవుతారు. ఉద్యోగంలో గందరగోళ వాతావరణం ఉంటుంది.
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాల్లో సమయస్ఫూర్తితో ప్రవర్తించాలి. ఇంటా బయట శాంతంగా వ్యవహరించాలి.
దీర్ఘకాలిక సమస్యలు కొంత ఒత్తిడి కలిగిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయంతో కొన్ని పనులు పూర్తవుతాయి. వ్యాపార వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచిది కాదు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విద్యార్థులకు కష్టంతో కానీ ఫలితం లభించదు.
దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. జీవిత బాగస్వామితో కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆదాయం బాగుంటుంది. కొంతవరకు రుణాలు తీరి ఊరట లభిస్తుంది. పనుల్లో జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు అనుకూలం.
దూర ప్రాంత బంధువుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వాహనయోగం ఉంది. ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగుల శ్రమ ఫలిస్తుంది. వ్యాపారాల్లో ఊహించని లాభాలు అందుకుంటారు. ఖర్చులు ఉన్నప్పటికీ ఆదాయానికి లోటు ఉండదు.
కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. ఉద్యోగంలో చేయని పనికి నిందలు పడతారు. పనులు సకాలంలో పూర్తి కాకా చికాకు వస్తుంది. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఆదాయానికి మించి ఖర్చులుంటాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.