ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 15.04.2025 మంగళవారానికి సంబంధించినవి.
ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడుతాయి. వృత్తి, వ్యాపారాల్లో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు వింటారు.
ఆర్థిక పరిస్థితి ఒక్కసారిగా మారిపోతుంది. రుణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనులు వాయిదా పడతాయి. విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. వ్యాపారంలో ఆలోచనలు అంతగా కలిసిరావు. వృత్తి, ఉద్యోగాల్లో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. ఖర్చులు అదుపులో పెట్టుకోవడం మంచిది.
అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలు ఓ కొలిక్కి వస్తాయి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు నుంచి బయటపడతారు. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నపటికీ విజయవంతంగా పూర్తి చేస్తారు. వ్యాపార, ఉద్యోగాల్లో లాభాలు పొందుతారు. మానసిక ప్రశాంతత పెరుగుతుంది.
సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని విజయం సాధిస్తారు. కొన్ని వివాదాల నుంచి బయట పడతారు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. నిరుద్యోగులు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వృత్తి, వ్యాపారాల్లో భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ పెద్దల సహకారంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికంగా బాగుంటుంది. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి.
అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. అనుకున్న సమయానికి పనులు పూర్తికావు. ఇతరులు పై మీ అభిప్రాయం మార్చుకోవడం మంచిది. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త వహించాలి. ఉద్యోగంలో అధికారుల నుంచి నిందలు పడతారు. వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
జీవిత భాగస్వామి నుంచి ఊహించని సహాయం అందుతుంది. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంట్లో సంతోషకర వాతావరణం ఉంటుంది. బంధు మిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో ఇతరులతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది.
ఆదాయం పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆకస్మిక విజయం పొందుతారు. స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు. బంధు మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహనయోగం ఉంది. వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా ఉంటాయి. ఉద్యోగాల్లో పదోన్నతులు పెరుగుతాయి.
పిల్లల ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో స్థిరత్వం లేని ఆలోచనలతో నష్టపోతారు. ఇతరులతో అకారణంగా విభేదాలు వస్తాయి. ఉద్యోగంలో విలువైన పత్రాల విషయంలో అప్రమత్తత అవసరం. ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది.
ధైర్య సాహసాలతో ముందుకు సాగుతారు. వృత్తి, వ్యాపారాల్లో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని లాభాలు పొందుతారు. అన్ని వైపుల నుండి మంచి జరుగుతుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.
వృత్తి, ఉద్యోగాల్లో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక ఇబ్బందులు తొలగిపోతాయి. మిత్రులతో వివాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ వాతావరణం సంతోషకరంగా ఉంటుంది. ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. రుణ సమస్యల నుంచి బయట పడతారు. నిరుద్యోగులకు ఉద్యోగయోగం ఉంది.
ఇంటా బయట ఒత్తిడి పెరుగుతుంది. దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దూర ప్రయాణాల్లో శ్రమ కలుగుతుంది. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు నిదానంగా సాగుతాయి. ఖర్చులు పెరుగుతాయి.