
డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హైదరాబాద్ - ఫోన్: 9440611151
5 జూన్ 2020 శుక్రవారం రోజు నాడు ఏర్పడే చంద్ర గ్రహం మన భారత దేశ కాలమానం నకు ఎలాంటి సంబంధం లేదు. అసలు ఈ గ్రహణాలు రెండు రకాలు ఛాయా గ్రహణము, ప్రచ్చాయ గ్రహణం అని పిలువబడుతాయి.
గ్రహాణాలు ఎలా ఏర్పడతాయి:- సూర్యునికి , భూమికి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది. రవి, భూమి ఎప్పటికీ ఒకే మార్గంలో ఉన్నప్పటికీ చంద్రుడు ఈ మార్గానికి 5 డిగ్రీలు పరిధిలో అటూ ఇటూ తిరుగుతుంటాడు. రవి, చంద్రులకు మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది. అయితే రవి, భూమి , చంద్రులు ఒకే సరళరేఖలో ఉండి చంద్రుడు రాహువు వద్ద గానీ కేతువు వద్దగానీ ఉన్నప్పుడు చంద్ర గ్రహణం ఏర్పడుతుంది.
పూర్తీ చంద్రబింబం కనబడకపోతే దాన్ని సంపూర్ణ చంద్ర గ్రహణం అని అంటారు. కొంత భాగం కనిపించక పొతే దానిని పాక్షిక చంద్రగ్రహణం అంటాం. సూర్యుని కాంతి చంద్రునిపైన పడుతుంది. భూమి నీడ పరిధిలోకి చంద్రుడు వచ్చినప్పుడు భూమి నీడ పరిధి దాటేంత వరకు పూర్తిగా కనిపించకుండా ఉంటాడు. ఈ స్థితినే గ్రహణం అని అంటాం. రాహువు వద్దకు గానీ కేతువు వద్దకు గానీ ఈ గ్రహాలు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది.
చంద్ర గ్రహణం:- చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చి చంద్రుడి మీద భూమి నీడ పడుతుంది. దీన్ని చంద్ర గ్రహణం అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు కనిపిస్తుంది.
చంద్రగ్రహణానికి కావలసిన పరిస్థితులు :- చంద్ర గ్రహణానికి క్రింది పరిస్థితులు కావలెను.
1. చంద్రుడు, భూమి, సూర్యుడు ఒకే సరళరేఖలో వుండాలి.
2. చంద్రుడికీ సూర్యుడికీ మధ్య భూమి వుండాలి.
3. నిండు పౌర్ణమి రాత్రి అయి వుండాలి.
4. చంద్రగ్రహణ కాలము చంద్రుడి స్థాన కక్ష్యాబిందువులపై ఆధారపడి వుంటుంది.
"ప్రతి ఛాయాగ్రహణం" అంటే భూమి ఛాయా పరిధిలో కాకుండా ప్రతి ఛాయాలో చంద్రుడు ప్రవేశించినప్పుడు ఏర్పడే చంద్ర గ్రహణం భారత కాలమాన ప్రకారం ప్రతి ఛాయా పాక్షిక చంద్ర గ్రహణమునకు భారతీయ శాస్త్ర సాంప్రదాయం ప్రకారం మనం ఈ గ్రహణానికి మనకు ఏలాంటి సంబంధం ఉండదు కాబట్టి ఎవరూ భయందోళనలు చెందనవసరం లేదు, గ్రహణ నియమాలు వర్తించవు. ఇది ఋషుల శోధనలో నిర్ధారించిన నియమం.
భారతదేశ కాల మానం ప్రకారం ఖగోళంలో ఈ ప్రతి ఛాయాగ్రహణం భూమిపై కాకుండా భూమి నీడపై పడుతుంది కాబట్టి మనకు ఎంత మాత్రం వర్తించదు. ఉదాహరణకు కరెంట్ వైర్ మన మీద పడితే షాక్ కొడుతుంది అది మనకు వర్తిస్తుంది. కానీ మన నీడ ( ఛాయా ) పై కరెంట్ తీగ పడుతే మనకు షాకు ఎలా తగలదో, వర్తించదో ఈ గ్రహణం కుడా మనకు అంతే కాబట్టి గర్భిని స్త్రీలు ఎలాంటి భయందోళనలు చెందనవసరం లేదు. కొందరు మనకు వర్తిస్తుంది అని ప్రచారం చేస్తున్నారు అందులో ఎంత మాత్రం వాస్తవం లేదు. ఏ పంచాంగాలలో గ్రహణం గురుంచి ఇది మనకు వరిస్తుందని రాయలేదు కాబట్టి నిస్సందేహంగా ఉండవచ్చు. లేనిపోని అనుమానాలు, అపోహలు పడవద్దు.
ప్రత్యేక సూచన :- భారత దేశంలో చంద్ర గ్రహణం లేదు కాబట్టి భారత దేశములో నివసించే వారికి ఈ గ్రహణ నియమాలు ఆచరించవలసిన అవసరం లేదు. ఈ గ్రహణం ఏయే ప్రాంతాలలో కనిపిస్తుందో అయా దేశ, ప్రాంతాల నివసించే వారికి మాత్రమే గ్రహణ నియమాలు వర్తిస్తాయి మనకు కాదు ఇది గమనించ గలరు.
మన భారతీయ సంస్కృతిలో మహర్షులు నిర్ధారించి చెప్పిన విషయం ఛాయా గ్రహణములే మానవాళిని ప్రభావితం చేస్తాయి. గ్రహణాల వలన భూమిపై ఏ ప్రాంతంలో కనబడుతుందో ఏ నక్షత్రంలో సంభవిస్తుందో వారికి ఆక్కడి ప్రజలకు ప్రభావం చూపిస్తాయి అని వారి పరిశోధన అనుభవంతో యోగ దృష్టితో కేవలం ఛాయా గ్రహణములనే పరిఘనలోకి తీసుకుని పాటించాలి అని తెలియజేసారు. ప్రతి ఛాయాగ్రహణాలు ఎలాంటి హానికరమైన ఫలితాలు ఇవ్వవని నిర్ధారించారు.