చంద్ర గ్రహణం.. శాంతి ఇలా చేసుకోవాలి

By telugu teamFirst Published Jul 8, 2019, 10:29 AM IST
Highlights

చంద్రునికి బుధుడు అనే కుమారుడు ఉన్నాడు. ఇతడు తారకు జన్మించినవాడు. చంద్రుని అధిదేవత ప్రత్యధిదేవత గౌరీదేవి. చంద్రుని మహాథకాలం పది సంవత్సరాలు. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. ఇతనికి ఉచ్చరాశి వృషభం.  27 నక్షత్రాలకు స్వామినాథుడు. నవగ్రహాలలో రెండవ స్థానానికి చెందినవాడు. చంథ్రాంతికి సోమవార వ్రతం చేయడం మంచిది.

చంద్రుడ గౌరవర్ణం కలిగినవాడు. చంద్రుని వస్త్రం, అశ్వం, రథం, అన్నీ తెలుపు రంగులోనే ఉంటాయి. బంగారుఆభరణాలు. ముత్యాల హారాలు ధరిస్తాడు. చేతిలో గదను ధరిస్తాడు. మరో చేతిలో వరముద్రను కలిగి ఉంటాను. ఇతనిని అన్నమయ, మనోమయ స్వరూపంగా భావిస్తారు.

శ్రీకృష్ణుడు పుట్టకముందే ప్టుినవాడు. అందువల్ల ఇతనిని షోడశ కళాపరిపూర్ణుడు అంటారు. చంద్రుడు సమస్త ప్రదేశాల్లో వ్యాపించి ఉంటాడు. అత్రి మహర్షి, అనసూయల పుత్రుడు. సర్వమయుడు. బీజ,  ఓషధి జలపూరుడు. అశ్విని భరణి మొదలైన నక్షత్రాలను మొత్తం27 మందిని వివాహం చేసుకున్నాడు.

వీరు నక్షత్రాలుగా తిరుగుతూ పతివ్రతా ధర్మాలను పాిస్తూ వర్షాలను మాసాలను విభజిస్తారు. పూర్ణిమనాడు చంద్రోదయ సమయానికి రాగిపాత్రలో తేనె కలిపిన పాయసం వండి చంద్రునికి సమర్పిస్తే శుభఫలితాలు ఉంటాయి.

ఇతని వాహనమైన రథంలో మూడు చక్రాలు మాత్రమే ఉంటాయి. పది గుర్రాలు ఇతని రథాన్ని చోటుచేసుకుని ఉంటాయి. గుర్రాలు దివ్యమైనవి. గుర్రాల కళ్ళు కూడా తెలుపురంగునే కలిగి ఉంటాయి. మత్స్య పురాణం పోలిన కంఠాన్ని కలిగి ఉంటాడు చంద్రుడు.

చంద్రునికి బుధుడు అనే కుమారుడు ఉన్నాడు. ఇతడు తారకు జన్మించినవాడు. చంద్రుని అధిదేవత ప్రత్యధిదేవత గౌరీదేవి. చంద్రుని మహాథకాలం పది సంవత్సరాలు. చంద్రుడు కర్కాటక రాశికి అధిపతి. ఇతనికి ఉచ్చరాశి వృషభం.  27 నక్షత్రాలకు స్వామినాథుడు. నవగ్రహాలలో రెండవ స్థానానికి చెందినవాడు. చంథ్రాంతికి సోమవార వ్రతం చేయడం మంచిది.

జ్యోతిశ్శాస్త్ర రీత్యా చంద్రుడు మనస్సుకు కారకుడు. మనస్సు చాలా చంచలమైనది. చంద్రుడు  ఒక రాశి మారడానికి 2 1/2 రోజులు పడుతుంది. అంతే వేగంగా మనసు కూడా చాలా చంచలమైనది. చంద్రుడిని అంటే మనస్సును అదుపులో పెట్టడం చాలా కష్టం. మనసును అదుపులో ప్టిెనవారు మిగతా అన్నినీ జయించినట్టే. అందుకే చంద్రమా మనసో జాతః అంటారు. జ్యోతిషంలో దశలు  లెక్కపెట్టడానికి కూడా చంద్రుని ఆధారంగా మాత్రమే చూస్తారు.

శివోపాసన, శివస్తుతి చేయాలి. వెండి శంఖం, వంశపాత్ర, తెల్లని చందనం, శనగలు, తెల్లని పూలు, పాలు, పెరుగు, ముత్యాలు, ఎద్దులు దానం ఇవ్వాలి. ఎద్దుని బ్రాహ్మణునికి దానం ఇవ్వాలి. తెలుపురంగు వస్త్రాలు కూడా దానం ఇవ్వాలి. తెలుపులో ముతకరంగు తెలుపు. అంటే ఖాదీ బట్టలు వస్తాయి. మెరిసే తెలుపు చంద్రునికి రాదు. దానివలన చంద్రగ్రహ ప్రభావంతో కలిగే చెడు ఫలితాలు దరి చేరవు.

నిరంతరం జపం చేస్తూ ఉంటే పదిరకాల ఆలోచనల నుంచి ఒకే రకమైన ఆలోచనవైపు మనస్సును కేంద్రీకరించవచ్చు.   అలా నిరంతరం జపం చేస్తూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఏ ఆలోచన లేని స్థితికి వస్తారు. ప్రతీ వారికి రావలసింది ఆ సహజ స్థితే. దానికోసం ప్రయత్నం చేయాలి. అలా రావడం వలన ఈ భూమిమీదకు ఎందుకు వచ్చారో, భగవంతుడు వారిని పంపించిన కారణం ఏమిటో పూర్తిచేసుకుటాంరు. సంచిత ప్రారబ్ధ కర్మలన్నీ పూర్తి అవుతాయి. శ్రీ మాత్రేనమః.

click me!