07జులై 2019 ఆదివారం రాశిఫలాలు

Published : Jul 07, 2019, 07:41 AM IST
07జులై 2019 ఆదివారం రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : స్త్రీల ద్వారా అనుకూలత ఏర్పడుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. రచలపై దృష్టి సారిస్తారు. సమీప వ్యక్తులు బంధువులతో అనుబంధాలు పెరుగుతాయి. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి. విహారయాత్రలు చేసే ఆలోచన. అడ్వర్‌టైజ్‌ మ్‌ెంలకు అనుకూల సమయం.లక్ష్మీపూజ, లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలిస్తాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : మధ్యవర్తిత్వాలు నెరవేరుతాయి. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. మాట విలువ పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు పెంచుకునే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తులవైపు దృష్టి ఉంటుంది. బంధాలు, బాధ్యతలు పెరుగుతాయి. లక్ష్మీపూజ, లలితా సహస్రనామపారాయణంశుభం.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : పట్టుదలతో కార్యచరణ ఉంటుంది. పనుల్లో ప్రణాళికలు ఉంాయి. ఆలోచనలను అనుగుణంగా మార్పు ఉంటుంది. సమిష్టి ఆదాయాలు.  కృషి శీలత ఉంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. కళారంగంలో అనుకూలత ఉంటుంది. లక్ష్మీపూజ, లలితా సహస్రనామ పారాయణం

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : విశ్రాంతి లభిస్తుంది. విలాసాలకోసం ఖర్చులు చేస్తారు. దూర ప్రయాణాలపై ఆలోచిస్తారు.  విహార యాత్రలపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. సుఖం కోసం ఆలోచిస్తారు. సుఖ సంతోషాలపై ఆలోచిస్తారు. లక్ష్మీపూజ, లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలిస్తాయి.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సమిష్టి ఆశయాలపై దృష్టి ఉంటుంది. సమిష్టి ఆదాయాలపై దృష్టి పెడతారు. కళాకారులకు మంచి అభివృద్ధి లభిస్తుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. అన్ని విధాలా ఆదాయాలు. ఉపాసనపై దృష్టి పెడతారు. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. లక్ష్మీపూజ, లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలిస్తాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  సామాజిక అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నతి పై దృష్టి ఉంటుంది. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. చేసే అన్ని పనుల్లో సంతృప్తి లభిస్తుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. ఇతరులపై ఆధారపడతారు. లక్ష్మీపూజ, లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలిస్తాయి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) :  విద్యార్థులకు కష్టకాలం. ఉన్నత విద్యలకై ప్రయత్నం. ప్రయాణాలపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులు చేస్తారు. దూరదృష్టి ఉంటుంది. చేసే పనుల్లో జాగ్రత్త అవసరం. పరిశోధకులకు ఒత్తిడి ఉంటుంది. లక్ష్మీపూజ, లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలిస్తాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) :  ఆకస్మిక లాభాలు వస్తాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. క్రయ విక్రయాలపై దృష్టి ఉంటుంది. ఆరోగ్య లోపాలు నివారణ. చెడు మార్గాల ద్వారా ఆదాయ సంపాదనకు యత్నం. ఇతరులపై ఆధారపడతారు. లక్ష్మీపూజ, లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలిస్తాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెట్టుబడులు ఇబ్బందికి గురిచేస్తాయి. పనుల్లో చిత్తచాంచల్యం. కార్య సాధనలో పట్టుదల అవసరం. ఆలోచనలకు అనుగుణంగా ఆశయాల మార్పు. అనారోగ్య సమస్యలు. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. భాగస్వాములతో జాగ్రత్త. లక్ష్మీపూజ, లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలిస్తాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. అనారోగ్య సూచనలు ఉంాయి. పోీల్లో గెలుపుకై శ్రమ అవసరం. గుర్తింపుకోసం ఆరాటపడతారు. ఋణ సంబంధ ఆలోచనల్లో ఒత్తిడి పెరుగుతుంది. ఔషధసేవనం తప్పనిసరి. లక్ష్మీపూజ, లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలిస్తాయి

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) :ఆలోచనలకు అనుకూలమైన కార్యాచరణ. మానసిక ప్రశాంతత. సృజనాత్మకత పెరుగుతుంది. కళాకారులకు అనుకూల సమయం. విద్యార్థులకు ఆనందకర వాతావరణం. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆలోచల్లో సంతృప్తి లభిస్తుంది. లక్ష్మీపూజ, లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలిస్తాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఒత్తిడి, శ్రమతో సౌకర్యాలు లభిస్తాయి. సంతృప్తి ఉంటుంది. మాతృసౌఖ్యం ఉంటుంది. మృష్టాన్న భోజనంపై దృష్టి ఉంటుంది. సుగంధ ద్రవ్యాలకై ఆలోచిస్తారు. అన్నిరకాల అభివృద్ధి సాధిస్తారు. ప్రయాణాల్లో సంతృప్తి లభిస్తుంది. లక్ష్మీపూజ, లలితా సహస్రనామ పారాయణం శుభ ఫలితాలిస్తాయి.

డా.ఎస్.ప్రతిభ

PREV
click me!

Recommended Stories

Mars Blessings: కుజుడి దయతో ఈ 5 రాశులవారికి చేతినిండా డబ్బులే! మీ రాశి ఉందేమో చూడండి
Shani Nakshatra pada Gochar: పదిరోజుల్లో శని కారణంగా.. ఈ 4 రాశుల తలరాతే మారిపోనుంది..!