
హోలీ పండగ వచ్చేస్తోంది. ఈ హోలీ సంబరాల్లో మునిగితేలేందుకు అందరూ తహతహలాడుతున్నారు. ఒకరికొరు రంగులు పూసుకుంటూ... ప్రజలు తమ కష్టాలన్నీ మరిచిపోయి హోలీ రంగుల్లో మునిగి తేలుతుంటారు.హోళికా దహనంతో చెడును, స్వార్థాన్ని, మోసాన్ని కాల్చివేసి మంచివైపు అడుగులు వేసే రంగుల పండుగ ఇది. హోలీ పౌర్ణమి రోజున ఇంట్లోకి కొన్ని వస్తువులు తెచ్చుకుంటే ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
హోలీ పౌర్ణమి రోజున ఈ వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో సంపదకు లోటు ఉండదు:
వెండి నాణెం కొనండి : జ్యోతిష్యశాస్త్ర రీత్యా హోలీ పౌర్ణమి నాడు వెండి నాణెం,వెండి చిన్న పెట్టె కొనండి. తర్వాత పసుపుతో పసుపు గుడ్డలో కట్టి లక్ష్మీ దేవి విగ్రహం పక్కన ఉంచాలి. హోలీ పౌర్ణమి నాడు హోలికను కాల్చిన తర్వాత లభించే బూడిదను మీరు కొన్న వెండి పెట్టెలో వేసి అల్మారాలో ఉంచండి. హోలీ పౌర్ణమి నాడు ఈ పద్ధతిని అనుసరించడం వల్ల మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు.
వెండి ఉంగరం కొనండి : వెండి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీన్ని ధరించడం వల్ల మన శరీరంలో చాలా మార్పులు సంభవిస్తాయి. చిన్న పిల్లలకు వెండి కంకణాలు వారి కండరాలను బలోపేతం చేస్తాయి. హోలీ పౌర్ణమి రోజున వెండి ఉంగరాన్ని కొని పూజించండి. పూజించిన ఉంగరాన్ని ప్రసాదంగా స్వీకరించి ధరించండి. వెండి ఉంగరంతో మీ అదృష్టం ఎప్పుడూ మీ వెంటే ఉంటుంది.
వెండి పట్టీలు: వెండి పట్టీలు శాస్త్రోక్తంగా కూడా మహిళలకు క్రెడిట్ ఇస్తుంది. హోలీ పౌర్ణమి రోజున పట్టీలను కొనండి. కొనుగోలు చేసిన తర్వాత పాలతో కడగాలి. అప్పుడు మీరు దానిని స్నేహితులకు ఇవ్వవచ్చు లేదా మీరే ధరించవచ్చు. హోళీ పౌర్ణమి నాడు వెండి పట్టీలు ధరించడం ద్వారా లక్ష్మీ అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది.
మార్చి 8న జరుపుకునే హోలీ పౌర్ణమి నాడు మీరు ఈ వస్తువులలో కొన్నింటిని కొనుగోలు చేస్తే, ఒక వ్యక్తి అన్ని బాధలు, రోగాలు , బాధల నుండి ఉపశమనం పొందుతారు. సాధారణంగా దీపావళి రోజున వెండి కొంటారు. అయితే జ్యోతిష్యంలో హోలీ పౌర్ణమికి ముఖ్యమైన స్థానం ఉంది. పాల్గుణ మాసం పౌర్ణమి నాడు వెండి వస్తువులు కొనుగోలు చేస్తే లక్ష్మీ అనుగ్రహం మనపై ఎప్పుడూ ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.