ఈ వారం రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : వృత్తి ఉద్యోగాదుల్లో కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. అధికారిక ప్రయాణాలు చేసే ఆలోచన వస్తుంది. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. స్త్రీల ద్వారా ఆదాయాలు వచ్చే అవకాశం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. నిత్యావసర ఖర్చులకై అధిక వ్యయం చేస్తారు. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు. ఇతరులపై ఆధారపడడం. సుబ్రహ్మణ్యారాధన, దుర్గా స్తోత్ర పారాయణ, దత్తాత్రేయ పారాయణ మంచి ఫలితాలనిస్తాయి.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సజ్జన సహకారం లభిస్తుంది. శుభకార్యాలకు వెళ్తారు.. పరిశోధనలపై ఆసక్తి వస్తుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. శాస్త్ర పరిజ్ఞానంపై దృష్టి ఏర్పడుతుంది. వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం పెరుగుతుంది. స్త్రీల ద్వారా ఆదాయం లభిస్తుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. సంతోషకర వాతావరణం. దత్తాత్రేయ ఆరాధన, సుబ్రహ్మణ్య ఆరాధన శుభ ఫలితాలనిస్తాయి.
undefined
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు వస్తాయి. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం. అనుకోని ఖర్చులు చేస్తారు. చెడు మార్గాలద్వారా ధనసంపాదనకు ప్రయత్నం చేస్తారు. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. ధనం దాచుకోవాలనే ఆలోచన వస్తుంది. పరిశోధనలపై ఆసక్తి ఏర్పడుతుంది. శుభకార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. 24,25 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ పారాయణ మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన పరిచయాల్లో అనుకూలత లభిస్తుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. భాగస్వామ్య అనుబంధాలు బలపడతాయి. ఊహించని ఇబ్బందులు కలుగుతాయి. అనుకోకుండా ధనం వెచ్చిస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విశ్రాంతికై ప్రయత్నిస్తారు. 26,27,28 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. సుబ్రహ్మణ్యారాధన, దత్తాత్రేయ స్తోత్ర పారాయణ శుభ ఫలితాలు ఇస్తాయి.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : శతృ, రుణ, రోగాలపై గెలుపు సాధిస్తారు. ఒత్తిడితో విజయ సాధన లభిస్తుంది. అనారోగ్య భావన కలుగుతుంది. ఔషధ సేవనం తప్పనిసరి చేయాలి. నష్టవస్తు పరిజ్ఞానం లభిస్తుంది. సామాజికంగా అనుకూలత ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం లభిస్తుంది. వైద్యశాలల సందర్శనం చేస్తారు. శ్రమలేని సంపాదనపై దృష్టి పెడతారు. 29,30 తేదీల్లో ముఖ్య నిర్ణయాల వాయిదా మంచిది. దత్తాత్రేయ స్తోత్ర పారాయణ మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మానసిక ప్రశాంతత లభిస్తుంది. సంతానం వల్ల సంతోషం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. రోగనిరోధక శక్తికై తపిస్తారు. అనారోగ్య భావన ఏర్పడుతుంది. శారీరక వ్యాయామం తప్పనిసరి చేసుకోవాలి. వృత్తి విద్యలపై దృష్టి సారిస్తారు. భాగస్వామ్య అనుబంధాలు విసృతి చెందుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పలుకుబడి లభిస్తుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సహకారం వల్ల సంతోషం కోల్పోతారు. తల్లితో అనుబంధం తగ్గిపోతుంది. ఆహారంలో సమయపాలన అవసరం. కళలపై ఆసక్తి పెరుగుతుంది. మానసిక ప్రశాంత లభిస్తుంది. సృజనాత్మతకత పెరుగుతుంది. గెలుపుపై ఆసక్తి ఏర్పడుతుంది. సంతానం వల్ల సంతోషం లభిస్తుంది. పరిపాలన సమర్ధత పెరుగుతుంది. శారీరక బలం వృద్ధి చెందుతుంది. సంతోషకర వాతావరణం లభిస్తుంది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : స్త్రీల వల్ల సహకారం లభిస్తుంది. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. దగ్గరి ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లో అనుకూలత ఏర్పడుతుంది. సహా ఉద్యోగుల సహకారం లభిస్తుంది. ఆహారం సరియైన సమయానికి స్వీకరించాలి. ప్రారంభించిన పనిని పూర్తిచేసి తీరుతారు. పనులలో ఉత్సాహం లభిస్తుంది. ఆనందకర వాతావరణం ఏర్పడుతుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాక్ చాతుర్యం పెరుగుతుంది. కుటుంబంలో సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిల్వ ధనం పై దృష్టి పెరుగుతుంది. వాహన సౌకర్యం లభిస్తుంది. స్త్రీల సహకారం లభిస్తుంది. నేత్రాలను జాగ్రత్తగా చూడాలి. సహాయకులు లభిస్తారు. కమ్యూనికేషన్స్ విస్తరిస్తాయి. సంతృప్తి లభిస్తుంది. శ్రీ దత్త శ్శరణం మమ, క్రీం అచ్యుతానంత గోవింద జపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. శ్రమలో సంతోషాన్ని చూస్తారు. ప్రణాళికా బద్ధమైన జీవితం ఏర్పరుస్తారు. ఆలోచనల్లో వైవిధ్యం కనిపిస్తుంది. మొండితనంలో పనులు పూర్తి చేస్తారు. కుటుంబంలో అనుకూలత లభిస్తుంది. ధన సంపద ప్రయత్నాలు ఫలిస్తాయి. స్నేహితులతో అనుకూలత ఏర్పడుతుంది. ఆశయ సాధన చేస్తారు. ప్రయాణాల్లో సంతోషం లభిస్తుంది. దానధర్మాలకు ఖర్చు అవసరం.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : నిత్యావసర ఖర్చులు పెరుగుతాయి. విశ్రాంతి లోపం ఏర్పడుతుంది. పాదాల నొప్పులు వస్తాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆలోచనల్లో మార్పులు వస్తాయి. నిత్య కృషి శీలత పెరుగుతుంది. చక్కని ప్రయత్నం చేస్తారు. స్నేహితులతో అనుబంధాలు పెరుగుతాయి. వాక్ చాతుర్యం పెరుగుతుంది. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామ రామ జపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : శ్రమలేని సంపాదనపై దృష్టి పెరుగుతుంది. మనోవ్యధ ఎక్కువ. చిత్త చాంచల్యాన్ని దూరం చేసుకోవాలి. రహస్య స్థావరాలపై దృష్టి ఏర్పడుతుంది. సుఖం కోసం ఆలోచిస్తారు. దేహసౌఖ్యం లోపిస్తుంది. ఆదర్శవంతమైన జీవితం కోసం ఆలోచిస్తారు. అన్నిరకాల ఆదాయాలకోసం ఊహిస్తారు. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఇతరులపై దయ చూపిస్తారు. తమ శ్రమను నమ్ముకుని బ్రతుకుతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
డా.ప్రతిభ