జననం విషయంలో అనేకాంశాలు ప్రభావితం చేస్తాయి. వేరు వేరు కాలాంశాల్లో పుట్టినవారి ఫలితాలు కూడా పరిశీలించడం అవసరం.
జననం విషయంలో అనేకాంశాలు ప్రభావితం చేస్తాయి. వేరు వేరు కాలాంశాల్లో పుట్టినవారి ఫలితాలు కూడా పరిశీలించడం అవసరం. అన్ని అంశాల సమగ్ర వివరణ వల్ల ఒక స్పష్టమైన ఫలితాన్ని సూచించే అవకాశం మనకు కలుంగుతుంది. కాలాంశాల్లో అయనాలు, ఋతువులుం, మాసాలుం, పక్షాలుం, తిథులు, దివారాత్రులు ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రాశి విభాగాల్లోని షడ్వర్గుల్లో జననమైతే కలిగే ఫలితాలను కూడా పరిగణనలోకి తీసుకొని పూర్ణ ఫలితాలను సూచించే అవకాశం ఉంటుంది. కాలాంశాలు అనేక విధాలుగా ఉంటాయి. ఆ యా సమయాల్లో గ్రహగతుల విషయాలను పరిగణనలోకి తీసుకొని ఈ స్థూల పరిశీలన ఉంటుంది. ఒక ఋతువులో సూర్య సంచారాన్ని ఫలితాలు మారవచ్చు. అదేవిధంగా మాసాల్లోనూ ఉండే రవిస్థితులను బ్టి ఫలితాల్లో మార్పులుం కనిపిస్తాయి.
చైత్రమాసం : వ్రత, ఉపవాసాదుల్లో ఇష్టపడేవారు, ధైర్యం కలిగినవారు, గురు దేవ భక్తి కలిగినవారు, దయ కలిగినవారు, బహుశాస్త్ర సమర్థులు, కాంతివంతులు, నిత్యోత్సవాలుం జరుపుకునేవారు, సుబుద్ధి కలిగినవారు అవుతారు.
undefined
వైశాఖమాసం : ఉదారగుణాలు కలిగినవారు, పండితులు, దానాలలో ఇష్టమైనవారు, బంధువులపై వాత్సల్యం కలిగినవారు, రాజులచే పూజింపబడేవారు, అతిగంభీరులు, దూరాలోచన, సత్వగుణం కలిగినవారు, స్వతంత్రులు అవుతారు.
జ్యేష్టమాసం : భోగాలను అనుభవించేవారు, ప్రజ్ఞావంతులుం, భాగ్యవంతులు, సుజనులు, యజ్ఞాది కర్మలయందు ఆసక్తులు, సుగుణాలు కలిగినవారు, దీర్ఘాయుష్మంతులు, క్రయవిక్రయాలు చేసేవారు అవుతారు.
ఆషాఢమాసం : అపజయాన్ని పొందేవారు, దానం చేయనివారు, దుష్టులు, ధనికులు, దురహంకారులు, దాతలను ఆక్షేపించేవారు, అధిక భోజనం చేసేవారు, పరస్త్రీ రతులు, అతి సాహసులు, వ్యాధియుతులు అవుతారు.
శ్రావణమాసం : అంతరంగాన్నిచ్చి మైత్రి చేసేవారు, సాత్వికులుం, నానాదేశాలుం తిరగడంలో ఇష్టపడేవారు, దేవతారాధన సమర్థులు, షోడశకర్మాధికారులు, శిల్పశాస్త్ర, న్యాయశాస్త్రాలుం తెలిసినవారు అవుతారు.
భాద్రపదమాసం : అల్పసంతానపరులు, తంత్రము గలవారు, ఇష్టమైన ఆహారం కలవారు, లోభం కలిగినవారు, భోగులు, చపలురు, దాత, భయం కలవారు, నాట్య సంగీత ప్రియులు అవుతారు.
ఆశ్వీజమాసం : కుటిలమైన మనస్తత్వం కలవారు, దరిద్రులు, చపలుంరు, స్వజన ద్వేషులు, డంబాచారాలు కలవారు, ఎక్కువగా మ్లాడేవారు, బడాయికి కోపపడేవారు, సేవకులు అధికంగా కలవారు, ఇష్టులతో గడపగలిగినవారు, పండితులు అవుతారు.
కార్తీకమాసం : ఉత్సాహం కలవారు, దానధర్మాలలో ఆసక్తి కలవారు, ధనవంతులు, సోమరులు, దైవ దర్శనం చేసేవారు, దైవభక్తులను దర్శించేవారు, స్థూలకాయులు, ఎరుపు దేహఛాయ కలవారు అవుతారు.
మార్గశిరమాసం : ధర్మాత్ములు, కార్య నిర్వహణ సమర్థత కలిగినవారు, దేవతారాధన చేసేవారు, న్యాయశాస్త్రం తెలుంసుకున్నవారు, శాస్త్ర విచారణా తత్పరులు, గాంభీర్యం కలవారు, తీర్థయాత్రలు చేసేవారు అవుతారు.
పుష్యమాసం : ఇతర స్త్రీలయందు ఇష్టులైవారు, గోప్యంగా ప్రవర్తించేవారు, క్రూరబుద్ధి, సాహసం కలవారు, చెడుమార్గాలను అనుసరించేవారు, కుటిలురు, కలహాలంటే ఇష్టపడేవారు, దుష్టులు, ధనగుణ బలాదులు కలిగినవారు, ధార్మికులు అవుతారు.
మాఘమాసం : ఐశ్వర్యం కలవారు, శాంత స్వభావులు, సత్యవంతులు, మంచి దయ కలిగినవారు, బంధుజన ప్రియులు, మూర్ఖపు బుద్ధి కలవారు, రూపవంతులు, వ్రత, ఉపవాసాదులపై దృష్టి కలవారవుతారు.
ఫాల్గుణమాసం : ధనవంతులు, ప్రభువులు, లోభం కలిగినవారు, నిత్యం భోగాలు అనుభవించేవారు, ఉపకారులు, విదేశాదుల్లో నివసించేవారు, దుర్గుణాలుం కలిగినవారు అవుతారు.
డా.ఎస్ ప్రతిభ