వాస్తుశాస్త్ర ప్రకారం ఎలాంటి స్థలాన్ని కొనకూడదు ?

By telugu news teamFirst Published Nov 10, 2021, 10:35 AM IST
Highlights

ఈశాన్యము తగ్గిన స్థలములను కొనకూడదు. ఇటువంటి స్థలాల్లో నివసించేవారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వంశాభివృద్ధి క్షీణిస్తుంది. సమాజ గౌరవాన్ని కోల్పోవటం జరుగుతుంది.

డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష, జాతక, వాస్తు శాస్త్ర పండితులు - శ్రీమన్నారాయణ ఉపాసకులు. 
        సునంద రాజన్ జ్యోతిష, జాతక, వాస్తు కేంద్రం. తార్నాక -హైదరాబాద్ - ఫోన్:  9440611151


మనం నివాసం కొరకు కొనే స్థలం తీసుకునే ముందు జాగ్రత్తగా పరిశీలించి తీసుకోవాలి. వాస్తుశాస్త్రానికి విరుద్ధంగా ఉన్న స్థలాలను కొనకూడదు. అవి ఏమిటో .. ఎలాంటి ఫలితాలు ఇస్తాయో చూద్దాం.   

ఇలాంటి స్థలాన్ని కొనకూడదు :- 

* ఈశాన్యము తగ్గిన స్థలములను కొనకూడదు. ఇటువంటి స్థలాల్లో నివసించేవారికి ఎన్నో కష్టాలు ఎదురవుతాయి. వంశాభివృద్ధి క్షీణిస్తుంది. సమాజ గౌరవాన్ని కోల్పోవటం జరుగుతుంది.

* స్థలానికి తూర్పు, ఉత్తర దిక్కులలో వేరే వారి స్థలాలు ఉంటే వారి స్థలాల నుండి నీరు మన స్థలంలోకి పారకుండా ఉండే విధంగా చూసుకోవాలి. ఇలా ఇతరుల స్థలంలోని నీరు మన స్థలంలోకి పారే విధంగా ఉంటే ఇటువంటి ఆ స్థలం నివసించటానికి మంచిది కాదు.

* రెండు విశాలమైన స్థలముల మధ్య నున్న ఇరుకైన స్థలాన్ని కొనకూడదు. దీనివలన మనశ్శాంతి ఉండదు. ఎన్నో ఒత్తిడిలకు లోనవుతారు.

ఇలాంటి స్థలాల్నికొనాలి:-

* ఆగ్నేయంగా ఉండి తూర్పు, ఈశాన్యం పెరిగి ఉంటే ఆ స్థలాన్ని కొనటం శుభఫలాన్నిస్తుంది. యజమానికి పేరు ప్రతిష్టలు, సంతానం, మంచి అభివృద్ధిలోకి వస్తారు.

* ఉత్తర- ఈశాన్యం పెరిగిన స్థలాన్ని కొంటే అన్నీ విధాల మంచి ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా ఐశ్వర్యాభివృద్ధిని కలుగ జేస్తుంది. ఆ ఇంట స్త్రీలకు సుఖ సంతోషాలకు లోటుండదు. 

తూర్పు- ఈశాన్యం, ఉత్తరం-ఈశాన్యం పెరిగిన స్థలాలను కొనటం ద్వారా మంచి సంపదలతో పాటు కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. కుటుంబం సుఖ సంతోషాలతో సాగుతుందని వాస్తు చెబుతోంది.
 

click me!