ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : నూతన సంబంధాలు అనుకూలిస్తాయి. సామాజిక అభివృద్ధి పెరుగుతుంది. భాగస్వామ్య అనుబంధాలు విస్తరిస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. పలుకుబడి పెరుగుతుంది. నూతన పనులు లాభిస్తాయి. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శ్రమతో పోటీ ల్లో గెలుపు సాధిస్తారు. ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఋణాలవల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు . అనారోగ్య భావన ఉంటుంది. రోగనిరోధకశక్తి తగ్గుతుంది. శారీరక వ్యాయామాలు తప్పనిసరి. సుబ్రహ్మణ్యారాధన చేసుకోవడం మంచిది.
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. సంతానం వల్ల సంతోషం కలుగుతుంది. సృజనాత్మకత పెరుగుతుంది. కళలపై ఆసక్తి ఏర్పడుతుంది. అతీంద్రియ శక్తులపై దృష్టి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పరిపాలన సమర్ధత ఉంటుంది. శ్రీదత్తశ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాల వలన జాగ్రత్తగా ఉండాలి. సుగంధ ద్రవ్యాలపై దృష్టి ఏర్పడుతుంది. మాతృ సౌఖ్య లోపం ఉంటుంది. ఆహారం విషయంలో జాగ్రత్త పాటించాలి . విద్యలో ఆటంకాలు ఉంటాయి. అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పెద్దల సహకారం లభిస్తుంది. ఉన్నతవర్గం వారితో అనుబంధాలు ఏర్పడతాయి. సహాధ్యాయుల సహాయ సహకారాలు ఉంటా యి. ప్రచార, ప్రసార సాధనాలు విస్తృతి చెందుతాయి. పరామర్శలు చేస్తారు. పనుల్లో కాస్త ఒత్తిడి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : మాటల్లో సున్నితత్వం ఏర్పడుతుంది. మాట విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఏర్పడుతుంది. నిల్వ ధనంపై ఆసక్తి పెరుగుతుంది. స్నేహసంబంధాలు విస్తరిస్తాయి. కింసంబంధ లోపాలు నివారించబడతాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ పెరుగుతుంది. ఆలోచనల్లో మార్పులు ఉంటా యి. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. సామాజిక అనుబంధాలు అనుకూలంగా ఉంటా యి. సంతృప్తి లభిస్తుంది. ప్రణాళికబద్ధమైన పనులు చేస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : దాన ధర్మాలకై వ్యయం అధికం చేస్తారు. ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి ఉంటుంది. విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. మానసిక వ్యధ ఏర్పడుతుంది. దేహసౌఖ్యం కోసం ఆలోచిస్తారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : సమిష్టి ఆశయాలపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధారపడతారు. అన్ని రకాల అభివృద్ధులు ఉంటా యి. ఆదర్శవంతమైన జీవితంకోసం ఆరాటపడతారు.కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఉపాసనపై దృష్టి ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచి ఫలితాలనిస్తుంది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : ఉద్యోగరీత్యా కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. అధికారులతో అప్రమత్తత అవసరం. సంఘంలో గౌరవం కోసం ఆరాటం ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. రాజకీయాలపై దృష్టి ఉంటుంది. జాగ్రత్త అవసరం. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పరిశోధనలపై ఆసక్తి ఏర్పడుతుంది. సజ్జన సాంగత్యం ఉంటుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు . దూర ప్రయాణాలపై దృష్టి ఏర్పడుతుంది. విశాల భావాలు ఏర్పడతాయి. గురువులపై శ్రద్ధ పెరుగుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఊహించని ఇబ్బందులు ఏర్పడతాయి. అనవసర ఖర్చులు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. వైద్యశాలల సందర్శనం చేస్తారు. ఇతరులపై ఆధారపడతారు. శ్రీరామ జయరామ జయజయ రామరామ జపం చేసుకోవడం మంచిది.
డా. ప్రతిభ
ఇవి కూడా చదవండి..
ఈ వారం( 24వ తేదీ నుంచి 30వ తేదీ వరకు) రాశిఫలాలు ఇలా ఉన్నాయి