25 సెప్టెంబర్ 2018 మంగళవారం మీ రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Sep 25, 2018, 9:36 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఆధ్యాత్మిక చింతన పెంచుకోవాలి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. శారీరక శ్రమ చస్తారు. అనవసర ఇబ్బందులు వస్తాయి. సమయం వృథా అవుతుంది. విద్యార్థులకుం ఒత్తిడితో గెలుపు ఉంటుంది.  అనవసర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. సంతృప్తి లోపం ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనారోగ్య సమస్యలు వస్తాయి. వైద్యశాలల సందర్శనం చేస్తారు. పరామర్శలు ఉంటాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వ్యాపారస్తులు జాగ్రత్త అవసరం. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఉంటుంది. భాగస్వాములతో జాగ్రత్త అవసరం. అనవసర ఇబ్బందులు ఉంటా యి. చిత్త చాంచల్యం పెరుగుతుంది. మానసిక ప్రశాంతత పెంచుకోవాలి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పోటీల్లో గెలుపు లభిస్తుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఋణ సంబంధ ఆలోచనలు తగ్గుతాయి. అనుకోని ఆదాయాలు ఉంటాయి. రోగ నిరోధకశక్తి పెరుగుతుంది. పట్టుదలతో కార్యసాధన ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : మానసిక ప్రశాంతతను కోల్పోతారు. సంతానం వల్ల సమస్యలు పెరుగుతాయి. చిత్త చాంచల్యం అధికం. సృజనాత్మకతను కోల్పోతారు. విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. పరిశోధనలు ముందుకు సాగవు.  నూతనోత్సాహం ఉండదు. క్రొత్త పనులు ప్రారంభించరాదు. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆహారం విషయంలో సమయపాలన అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. విద్యార్థులకుం ఒత్తిడి ఉంటుంది. పనుల్లో జాగ్రత్త అవసరం. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సేవక జన సహకారం లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సేవకుంల ద్వారా ఆదాయం లభిస్తుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. విద్యార్థులకుం అనుకూల సమయం. ప్రయాణాల్లో సంతృప్తి లభిస్తుంది. ఆధ్యాత్మిక యాత్రలపై ఆలోచన ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : వాగ్దానాల వల్ల ఆటంకాలు ఏర్పడతాయి. వాక్‌చాతుర్యం తగ్గుతుంది. మాటను నిలబెట్టుకోవడానికి కష్టపడతారు. కుంటుంబంలో సహకార లోపం ఉంటుంది. అనుకోని ఇబ్బందులు ఉంటా యి. నిల్వ ధనం కోల్పోయే ప్రమాదం ఉంటుంది. ఆసక్తులు తగ్గించుకోవాలి. మౌనం వహించాలి. శ్రీదత్త శ్శరణం మమ జపం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : శారీరక శ్రమ ఉంటుంది. పనుల్లో ఆలస్యాలు ఉంటా యి. అనారోగ్య భావన ఏర్పడుతుంది. పట్టుదల అవసరం. అనవసర కష్టాలు తెచ్చుకుంటారు. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. పనుల్లో ప్రణాళికలు అవసరం అవుతాయి. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : విశ్రాంతి లోపం ఉంటుంది. మానసిక ఒత్తిడి అధికం. చిత్త చాంచల్యం పెరుగుతుంది. పాదాల నొప్పులు పెరుగుతాయి. అనవసర ఖర్చులు చేస్తారు. అనవసర ప్రయాణాలు చేస్తారు. పనుల్లో ఆలస్యం జరుగుతుంది. పరాధీనం ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతృప్తి లభిస్తుంది. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆదాయం పెంచుకునే మార్గాలు చూసుకుంటారు. విద్యార్థులకుం అనుకూల సమయం. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : అధికారులతో ఒత్తిడి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. గౌరవం కోసం ఆరాటపడతారు. అనవసర ఆపదలు కొనుక్కుటారు. కీర్తి ప్రతిష్టలు పెంచుకునే ప్రయత్నం. సంఘంలో గుర్తింపుకోసం తపన పడతారు. శ్రమాధిక్యం ఉంటుంది. శ్రీ దత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్. ప్రతిభ

click me!
Last Updated Sep 25, 2018, 9:36 AM IST
click me!