24 సెప్టెంబర్ 2018 సోమవారం మీ రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Sep 24, 2018, 9:42 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సామాజిక అనుబంధాలు అభివృద్ధి చెందుతాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. పనుల్లో ఆసక్తి పెరుగుతుంది. భాగస్వామ్య అనుబంధాలు వృద్ధి చెందుతాయి. పదిమందిలో గౌరవం పెరుగుతుంది. సంపదలు పెంచుకునే ఆలోచన ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం. గుర్తింపు కోల్పోతారు. ఊహించని ఇబ్బందులు. విద్యార్థులకు కష్టకాలం. శత్రువులతో జాగ్రత్త అవసరం. పెద్దలవారితో పనులలో ఆచి, తూచి వ్యవహరించాలి. ఋణసంబంధ ఆలోచనలను పెంచుకుంటారు. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : సంతాన సమస్యలు తీరుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. అనుకుంన్న పనులు పూర్తి చేస్తారు. సృజనాత్మకత పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. సంతృప్తి లభిస్తుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సౌకర్యాలు ఒత్తిడితో సమకూరుతాయి. ఆహారంలో సమయ పాలన అవసరం. అనవసర ఇబ్బందులు వచ్చే సూచన. అనారోగ్య సమస్యలకు అవకాశం. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. అనుకున్న పనులు పూర్తికావు. విద్యార్థులకు ఒత్తిడి అధికం. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : సహకార లోపం ఉంటుంది. పెద్దలతో ఆచి, తూచి వ్యవహరించాలి. కమ్యూనికేషన్స్‌ వల్ల ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థులకు అననుకూల సమయం. చిత్తచాంచల్యం పెరుగుతుంది. పరామర్శలు చేస్తారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. నిరంతర జపం ముఖ్యం. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : నిల్వ ధనాన్ని పెంచుకుంనే ప్రయత్నం చేస్తారు. వాగ్దానాలు నెరవేరుస్తారు. మాటవిలువ పెరుగుతుంది. కుంటుంబంలో అనుకూలత పెరుగుతుంది. ధాతృత్వం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. సంతృప్తి లభిస్తుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. అనవసర ప్రయాణాలు చేస్తారు. ఉద్యోగస్తులకు టా న్ఫర్స్‌ వచ్చే సూచనలు. పనులలో పట్టుదల అవసరం. కార్యసాధన ఉంటుంది. అభిరుచులకు అనుగుణంగా ఆలోచనలు మారుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. జ్ఞానం పెరచుకుంటారు. శ్రీదత్తశ్శరణం మమ జపం మంచిది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : విశ్రాంతి లోపం ఉంటుంది. అవనసర ప్రయాణాలు చేస్తారు. పనులలో ఆటంకాలు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. శ్రమ పెరుగుతుంది. సుఖంకోసం ఆరాటపడతారు. చిత్త చాంచల్యం అధికంగా ఉంటుంది. దేహసౌఖ్యం కోసం ఆరాటపడతారు. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. సమిష్టి ఆశయాలు నెరవేరుతాయి. కళలపై ఆసక్తి పెరుగుతుంది. ఆలోచనల్లో అభివృద్ధి ఉంటుంది. పరాశ్రయాన్ని తగ్గిస్తారు. తనను తాను నిలబెట్టుకుంనే ప్రయత్నం చేస్తారు. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారులతో ఒత్తిడి ఉంటుంది. చేసే వృత్తులలో సహాయ సహకారాలు లోపిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కీర్తి ప్రతిష్టలు పెంచుకుంటారు. ఇతరులపై ఆధారపడతారు. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విద్యార్థులకుం అనుకూల సమయం. పరిశోధనలపై  ఆసక్తి చూపుతారు. దూరదృష్టి పెరుగుతుంది. దూర ప్రయాణాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. మృష్టాన్నభోజనంపై ఆలోచన. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ప్రమాదాలకుం అవకాశం. ఆరోగ్య లోపం ఏర్పడుతుంది. వైద్యశాలల సందర్శనం. ఇతరులపై ఆధారపడతారు. లాభనష్టాలు సమానంగా ఉంటాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. శ్రీదత్త శ్శరణం మమ జపం చేసుకోవడం మంచిది.

డా.ఎస్ ప్రతిభ

click me!