1డిసెంబర్ 2018 శనివారం రాశిఫలాలు

By ramya neerukondaFirst Published Dec 1, 2018, 9:29 AM IST
Highlights

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఒత్తిడితో పనులు పూర్తి. అనుకోని ఖర్చులు ఉంటాయి. వైద్యశాలల సందర్శనం. వ్యాపారస్తులకు అప్రమత్తత. క్రయ విక్రయాల్లో జాగ్రత్త అవసరం. ఇతరులపై ఆధారపడతారు. అనుకోని  ఆటంకాలు వచ్చే సూచన. అనారోగ్య భావన. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : భాగస్వామ్య అనుబంధాల్లో ఒత్తిడి. నూతన పరిచయాలు అననుకూలం. పదిమందిలో గౌరవం కోసం ఆరాటపడతారు. అనేక రకాల ఒత్తిడులు వస్తాయి. పోయిన వస్తువులపై ఆలోచన ఉంటుంది. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

 

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : శ్రమాధిక్యం. గుర్తింపు లభిస్తుంది. పోటీల్లో గెలుపు. శతృవులపై విజయం సాధిస్తారు. ఋణబాధలు తీరుతాయి. రోగనిరోధక శక్తి పెంపొందించుకోవడం. అధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తి విద్యలపై ఆలోచన ఉంటుంది.సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సృజనాత్మకతను కోల్పోతారు. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతానం వల్ల సమస్యలు అధికమౌతాయి. విద్యార్థులకు అధిక శ్రమ ఉంటుంది. పరిపాలన సమర్ధత కలిగి ఉంటారు. కళాకారులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. ఓం నమఃశివాయ జపం చేసుకోవడం మంచిది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : ఒత్తిడితో సౌకర్యాలు సాధిస్తారు. మాతృసౌఖ్య లోపం ఏర్పడుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులు ఒత్తిడితో ఉత్తమ ఫలితాల సాధన. ఆహారంలో సమయ పాలన అవసరం. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) :  అధికారుల సహాయ సహకారాలు అందుతాయి. అధికారిక ఆలోచనల్లో అనుకూలతలు. అధికారిక ప్రయాణాలు చేస్తారు. ప్రయాణాల్లో సంతోషం కలుగుతుంది. అన్ని రకాల అనుకూలతలు ఉంటాయి. కొంత జాగ్రత్త అవసరం. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : మాటల్లో అధికారిక ధోరణి ఉంటుంది. వాక్‌ చాతుర్యం తగ్గుతుంది. కుటుంబంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక నిల్వలు తగ్గిపోయే ప్రమాదం. కంటి సంబంధ లోపాలు వస్తాయి. విలువైన వస్తువులపై దృష్టి ఉంటుంది. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శారీరక శ్రమ అధికం. గుర్తింపుకోసం ఆరాటం. పనుల్లో ఒత్తిడి ఉంటుంది. ప్రణాళికాబద్ధమైన జీవితం అవసరం. ఆలోచనలకు తగిన రూపకల్పన చేయాలి. కార్య సాధనలో పట్టుదల ఉంటుంది. ఉద్యోగ మార్పులు ఉంటాయి. అనవసర ప్రయాణాలు చేస్తారు. జాగ్రత్త అవసరం. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : విశ్రాంతిలోపం ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు చేస్తారు. సుఖం కోసం ఆరాటం ఉంటుంది. పాదాల నొప్పులు ఉంటాయి. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. ఇతరులపై ఆధార పడతారు. పరామర్శలు ఉంటాయి. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. సమిష్టి ఆదాయాలు ఉంటాయి. ఆదర్శవంతమైన జీవితానికై ప్రయత్నం. సంఘవ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. అన్ని విధాల అనుకూలతలు ఉంటాయి. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. శ్రమాధిక్యం ఉంటుంది. గుర్తింపు లభిస్తుంది. అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అధికారులతో అప్రమత్తత అవసరం. సంఘంలో గౌరవం కోసం ఆరాటపడతారు. రాజకీయ ఆలోచనలు. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : విద్యార్థులకు ఒత్తిడి సూచన. విశాల భావాలు ఉంటాయి.  పరిశోధనల వల్ల ఒత్తిడి ఉంటుంది. విదేశ వ్యవహారాలపై ఆలోచన ఉంటుంది. రాజకీయాలవైపు ఆలోచనలు ఉంటాయి. ప్రయణాలపై దృష్టి కేంద్రీకరిస్తారు. సూర్యారాధన, సూర్యాష్టకం, శివస్తుతి ఉపయోగపడతాయి.

డా.ఎస్.ప్రతిభ

click me!