11అక్టోబర్ 2018 గురువారం రాశిఫలాలు

Published : Oct 11, 2018, 09:36 AM IST
11అక్టోబర్ 2018 గురువారం రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : సౌకర్యాలు ఒత్తిడితో సమకూరుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. విద్యార్థులకు ఒత్తిడి ఉంటుంది. సామాజిక అనుబంధాల్లో లోపాలు ఉంటాయి. వ్యాపారస్తులు అప్రమత్తత అవసరం. అనవసర ఇబ్బందులు. నూతనపరిచయాలు అనుకూలిస్తాయి. ఆహారంలోసమయపాలన అవసరం. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : సహకారం వల్ల సమస్యలు తీరుతాయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. శతృవులపై విజయంకోసం ఆరాట పడతారు. రోగనిరోధకశక్తి పెంచుకునే ప్రయత్నం. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : వాగ్దానాలవల్ల ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో అసౌకర్యం ఏర్పడుతుంది. నిల్వ ధనాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. సంతానం వల్ల సమస్యల వస్తాయి. సృజనాత్మకత పెరుగుతుంది. కళలపై ఆసక్తి పెరుగుతుంది. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : శారీర శ్రమ ఏర్పడుతుంది. కార్యసాధనలో పట్టుదల అవసరం.  అనవసర ఇబ్బందులు ఉంటాయి. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆహారం విషయంలో సమయపాలన అవసరం. అనవసర ఒత్తిడులుటాంయి. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. అనవసర ఖర్చులు చేస్తారు. అనవసర ప్రయాణాలు ఉంటాయి. కాలం దుర్వినియోగం అవుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. పెద్దల సహకారాలు లభిస్తాయి. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.    

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సమిష్టి ఆదాయాలు లభిస్తాయి. కళానైపుణ్యం పెరుగుతుంది. సంఘవ్యవహారాల్లో లోపాలు ఉంటాయి. పరాశ్రయం ఉంటుంది. శ్రమలేని ఆదాయంపై దృష్టి ఉంటుంది. వాగ్దానాలు నెరవేరుతాయి. కుటుంబంలో సంతోష వాతావరణం ఉంటుంది. నిల్వ ధనం పెంచుకుటాంరు. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3 పాదాలు) : అధికారులతో అనుకూలత ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అనవసర ఇబ్బందులు. సంఘంలో గౌరవమర్యాదలు పెంచుకునే ఆలోచన. శారీరక శ్రమ అధికం. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. చిత్తచాంచల్యం తగ్గుతుంది. పట్టుదలతో కార్యసాధన చేస్తారు. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.           

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : శుభకార్యాలలో పాల్గొనాలనే ఆలోచన. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. విద్యార్థులకు కష్టకాలం ఉంటుంది. దూరదృష్టి ఉంటుంది. ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. విశ్రాంతికై పరితపిస్తారు.   పాదాలనొప్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనవసర ఇబ్బందులు  ఉంటాయి. వైద్యశాలల సందర్శనం ఉంటుంది. అనారోగ్య సూచన ఉంటుంది. పరాశ్రయం ఉంటుంది. లాభనష్టాలు సమానం.  పెద్దల ఆశీస్సులకై ప్రయత్నిస్తారు. సమిష్టి ఆదాయాలు. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : సామాజిక అనుబంధాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. భాగస్వాముల ఒత్తిడి ఏర్పడుతుంది. నూతన పరిచయాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. వృత్తిలో అనుకూలత ఏర్పడుతుంది. సంఘంలో గౌరవం పెంచుకునే ప్రయత్నం. కీర్తిప్రతిష్టలకై ఆలోచన. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం చేస్తారు. శత్రువులపై విజయంకోసం తపన. శ్రమాధిక్యం ఉటుంది. గుర్తింపుకై తపన. శుభకార్యాల్లో పాల్గొనే ఆలోచన సజ్జన సాంగత్యం ఉంటుంది. మృష్టాన్నభోజనంపై దృష్టి ఉంటుంది. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : మానసిక ప్రశాంతత తగ్గుతుంది. సంతాన సమస్యలు పెరుగుతాయి.   చిత్తచాంచల్యం పెరుగుతుంది. పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుంది. ఊహించని ఇబ్బందులు ఉంటాయి. క్రయ విక్రయాలపై దృష్టి తగ్గుతుంది. అనవసర ఇబ్బందులు ఉంటాయి. దేవీస్తోత్రపారాయణ శుభఫలితాలనిస్తుంది.

డా.ఎస్.ప్రతిభ

PREV
click me!

Recommended Stories

Birth Month: ఈ 5 నెలల్లో పుట్టిన వారు ఎప్పటికైనా ధనవంతులు అవుతారు..!
డిసెంబ‌ర్ 20 నుంచి ఈ రాశుల వారు జాగ్రత్త‌గా ఉండాలి, జీవితంలో అనుకోని మార్పులు ఖాయం