10అక్టోబర్ 2018 బుధవారం రాశిఫలాలు

Published : Oct 10, 2018, 09:36 AM IST
10అక్టోబర్ 2018 బుధవారం  రాశిఫలాలు

సారాంశం

ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి

మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : ఉద్యోగులతో అప్రమత్తత అవసరం. అనవసర ఇబ్బందులు వస్తాయి.  ఒత్తిడితో సౌకర్యాలు పూర్తి. ఆహారంలో సమయపాలన అవసరం. సంఘంలో గుర్తింపుకోసం ఆరాటం ఉంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. గౌరవహాని ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : శుభకార్యాల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటుంది. విద్యార్థులకు ఒత్తిడి ఏర్పడుతుంది. ఇతరుల సహాయ సహకారాలు లభిస్తాయి. అనవసర ఇబ్బందులు వుటాంయి. దగ్గరి ప్రయాణాలపై దృష్టి ఉంటుంది.  సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : అనవసర ఇబ్బందులు ఉంటాయి. ఊహించని ప్రమాదాలు వచ్చేసూచన. వాగ్దానాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. మాట విలువ తగ్గుతుంది. నిల్వ ధనాన్ని కోల్పోతారు. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. జాగ్రత్త అవసరం. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : సామాజిక అనుబంధాలల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. గౌరవహాని జరుగవచ్చు. కీర్తికోసం ఆరాటం ఉంటుంది. శారరీక శ్రమ ఉంటుంది. కార్యసాధనలో పట్టుదల అవసరం. అనవసర ఇబ్బందుల జోలికి వెళ్ళరాదు. అనారోగ్య సూచన ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీ ల్లో గెలుపుకై ప్రయత్నం. వృత్తి విద్యలపై ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూల సమయం. శత్రవులపై విజయం. అనవసర ఖర్చులు చేస్తారు. విహార యాత్రలపై దృష్టి ఉంటుంది.  పాదాల నొప్పులు ఉంటాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : సంతాన ఆలోచనల్లో సమస్యలు ఉంటాయి. మానసిక ప్రశాంతతకై ఆలోచన ఉంటుంది. పరిపాలన సమర్థత ఉంటుంది. విద్యార్థులకు కొంత కష్టకాలం ఉంటుంది. శ్రమలేని ఆదాయం పై దృష్టి ఉంటుంది. దురాశ ఏర్పడుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : ఒత్తిడితో సౌకర్యాలు పూర్తిచేస్తారు. అనవసర ఇబ్బందులు ఉంటాయి. ఆహారంలో సమయపాలన అవసరం. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. వృత్తి ఉద్యోగాదుల్లో ఒత్తిడి. సంఘంలో గౌరవంకోసం ఆరాటపడతారు. జాగ్రత్త అవసరం. సోదర వర్గీయుల సహకారానికై ప్రయత్నం. రచనలపై ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సోదర వర్గీయుల సహకారానికై ప్రయత్నం. రచనలపై ఆసక్తి పెరుగుతుంది. కమ్యూనికేషన్స్‌ అనుకూలిస్తాయి. విద్యార్థులు అధిక శ్రమతో విజయాలను సాధిస్తారు. దూర ప్రయాణాలపై దృష్టి ఉంటుంది. సంతృప్తి తక్కువగా ఉంటుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాల వల్ల ఇబ్బందులు ఉంటాయి. కుటుంబంలో ఒత్తిడి ఏర్పడుతుంది. నిల్వ ధనంపై దృష్టి పెరుగుతుంది. మాటల్లో కాఠిన్యత ఏర్పడుతుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి. శ్రమలేని సంపాదనపై దృష్టి ఉంటుంది. వైద్యశాలల సందర్శనం. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ ఉంటుంది. పట్టుదలతో కార్యం సాధిస్తారు. ఆలోచనలకు అనుగుణంగా ప్రణాళికల మార్పు ఉంటుంది. గుర్తింపుకోసం ఆరాటపడతారు. నూతన పరిచయాల వల్ల జాగ్రత్త అవసరం. సామాజిక అభివృద్ధి తగ్గుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : అనవసర ప్రయాణాలు చేస్తారు. అనవసర ఖర్చులు ఉంటాయి. విశ్రాంతిలోపం ఉంటుంది. పాదాల నొప్పులు ఏర్పడతాయి. శత్రువులపై విజయానికి ప్రయత్నం. పోటీ ల్లో గెలుపుకై తపన పడతారు. గుర్తింపుకోసం ఆరాటం. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులకై ప్రయత్నం ఉంటుంది. సమిష్టి ఆశయాలు ఉంటాయి. ఆలోచనల వల్ల ప్రయత్న సాధన ఉంటుంది. కొన్ని పనుల్లో నిరాశలు ఉంటాయి. మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. సంతాన సమస్యలు పెరుగుతాయి. సుబ్రహ్మణ్య ఆరాధన, దుర్గా ఆరాధన శుభ ఫలితాలనిస్తుంది.

డా.ఎస్. ప్రతిభ

PREV
click me!

Recommended Stories

July Horoscope: ఈ నెలలో ఓ రాశివారు స్త్రీ సంబంధిత వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది!
Enemy Planets Conjunction: రెండు శత్రు గ్రహాల అరుదైన కలయిక..ఈ 5 రాశులకు అపారమైన లాభాలు పక్కా