ఈ రోజు రాశిఫలాలు ఇలా ఉన్నాయి
మేషం :(అశ్విని, భరణి, కృత్తిక 1వపాదం) : శ్రమ, కాలం, ధనం వ్యర్థం కాకుండా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగాదుల్లో అప్రమత్తత అవసరం. చేసే పనుల్లో నిరాశ ఉంటుంది. దైవ చింతన పెరుగుతుంది. శుభకార్యాల్లో పాల్గొటాంరు. ఉద్యోగ ప్రయాణాలు చేస్తారు. సహకార లోపం ఉంటుంది. జాగ్రత్త అవసరం. శ్రీ రాజమాతంగ్యై నమః జపం చేసుకోవడం మంచిది.
వృషభం :(కృత్తిక 2,3,4 పాదాలు, రోహిణి, మృగశిర 1,2పాదాలు) : ఆధ్యాత్మిక యాత్రలపై దృష్టి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కీర్తి ప్రతిష్టలకై ఆరాటం ఉంటుంది. సజ్జన సాంగత్యం ఉంటుంది.విద్యార్థులకు అధిక శ్రమ. మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. పరిశోధనలపై ఆసక్తి ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
డా.ఎస్.ప్రతిభ
మిథునం :(మృగశిర 3,4పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1,2,3 పాదాలు) : ఊహించని ఇబ్బందులు ఉంటాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్య లోపం ఏర్పడుతుంది. ఔషధ సేవనం అవసరం. ఇతరులపై ఆధారపడతారు. పరాశ్రయం లభిస్తుంది. అనవసర ఇబ్బందులు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
కర్కాటకం :(పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష) : పరస్పర సహకారం లోపం. సామాజిక అనుబంధాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. నూతన పరిచయాలు లాభించవు. భాగస్వామ్య అనుబంధాలు బలపరచుకునే ప్రయత్నం పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి. ఆలోచించి వ్యవహరించాలి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) : పోటీల్లో గెలుపుకై ప్రయత్నం. శత్రువులతో జాగ్రత్త అవసరం. అధికంగా ఉండే అవకాశం. అనారోగ్య భావన ఉంటుంది. ఔషధ సేవనం తప్పనిసరి. వృత్తి విద్యల్లో నిరాశ, నిస్పృహలు ఉంటాయి. ఋణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొటాంరు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
కన్య :(ఉత్తర 2,3,4 పాదాలు, హస్త, చిత్త 1,2 పాదాలు) : విద్యార్థులకు అధిక ఒత్తిడి. సంతానం వల్ల సమస్యలు ఉంటాయి. మానసిక చికాకులు అధికం. సృజనాత్మకతను కోల్పోతారు. కళలపై నిరాశ ఏర్పడుతుంది. పరిపాలన సమర్ధతను కోల్పోతారు. చిత్త చాంచల్యం అధికం. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
తుల :(చిత్త 3,4 పాదాలు, స్వాతి, విశాఖ 1,2,3పాదాలు) : సౌకర్యాల వల్ల ఒత్తిడి ఏర్పడుతుంది. ఆహారంలో అరుగుదల తగ్గుతుంది. అనవసర ప్రయాసలు పడతారు. అనారోగ్య భావన ఉంటుంది. సుగంధ ద్రవ్యాలపై ఆసక్తి పెరుగుతుంది. ప్రాథమిక విద్యలో ఆటంకాలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
వృశ్చికం :(విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ) : సహకారం కోల్పోతారు. ప్రచార సాధనాల్లో లోపాలు కనపడతాయి. ప్రసార సాధనాల్లో అననుకూలతలు ఉంటాయి. పరామర్శలు ఉంటాయి. పుస్తక పఠనం ఆసక్తి ఉంటుంది. దగ్గరి ఆధ్యాత్మిక ప్రయాణాలు చేయాలనే ఆలోచన ఉంటుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
ధనుస్సు :(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వపాదం) : వాగ్దానాలు చేయరాదు. మా వల్ల ఇబ్బందులు. వాక్ చాతుర్యాన్ని కోల్పోతారు. కుటుంబంలో అసౌకర్యం ఉంటుంది. స్థిరాస్థిని కోల్పోవాలనే ఆలోచన ఉంటుంది. మాటల్లో చేసే పనుల్లో నిరాశ, నిస్పృహలు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
మకరం :(ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పాదాలు) : శారీరక శ్రమ అధికం. అనారోగ్య భావన ఉంటుంది. ఆలోచనల్లో మార్పులు ఉంటాయి. పట్టుదల కోల్పోతారు. ఔషధ సేవనం అవసరం. నిత్యావసర ఖర్చులకై ఆరాటం ఉంటుంది. అనవసర ఇబ్బందులు ఎదుర్కొటాంరు. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.
కుంభం :(ధనిష్ఠ 3,4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3పాదాలు) : విశ్రాంతికై ప్రయత్నం చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆధ్యాత్మిక యాత్రలకై ప్రయత్నం. ఆధ్యాత్మిక ఖర్చులు చేస్తారు. పాదాల సంబంధ నొప్పులు ఉంటాయి. శ్రీరామ జయరామ జయజయ రామరామ, క్రీం అచ్యుతానంతగోవింద మంత్రజపం చేసుకోవడం మంచిది.
మీనం :(పూర్వాభాద్ర 4వపాదం, ఉత్తరాభాద్ర, రేవతి) : పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. పనుల్లో కొంత అనుకూలత ఉంటుంది. దురాశ ఉంటుంది. సమిష్టి ఆదాయాలకై ఆలోచన ఏర్పడుతుంది. ఇతరులపై ఆధారపడతారు. పనిలో నైపుణ్యం తగ్గుతుంది. ఉపాసనపై దృష్టి ఏర్పడుతుంది. శ్రీరామ జయరామ జయజయ రామరామ మంత్రజపం చేసుకోవడం మంచిది.