లారీని ఢీకొట్టిన వైఎస్ షర్మిల ప్రచార రథం: ఒకరి మృతి

Published : Apr 11, 2019, 06:51 AM IST
లారీని ఢీకొట్టిన వైఎస్ షర్మిల ప్రచార రథం: ఒకరి మృతి

సారాంశం

షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని విజయవాడ నుంచి పులివెందులకు వెళ్తున్న ప్రచార రథం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. 

నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ సోదరి షర్మిల ఎన్నికల ప్రచార రథం ఓ లారీని ఢీకొంది. ఈ  ఘటనలో ఒకరు మరణించగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. 

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల పరిధిలోని కృష్ణాపురం గ్రామం వద్ద బుధవారం ఈ ప్రమాదం జరిగింది. షర్మిల ఎన్నికల ప్రచారాన్ని ముగించుకుని విజయవాడ నుంచి పులివెందులకు వెళ్తున్న ప్రచార రథం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నట్లు పోలీసులు తెలిపారు. 

ఈ ప్రమాదంలో కడప జిల్లా మైదుకూరు మండలం ముదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన లారీ డ్రైవర్‌ నగిరి సంజీవనాయుడు (52) అక్కడికక్కడే మరణించాడు.

PREV
click me!

Recommended Stories

New year Celebrations : మూగచెవిటి పిల్లలతో కేక్ కట్ చేయించిన ఆళ్లనాని
పార్లమెంట్ లో వైసీపీ మహిళాశక్తి: ఆ నలుగురు.....