వైసీపీలోకి బ్రహ్మానందరెడ్డి: నంద్యాల ఎంపీగా పోటీ చేసే అవకాశం

By Nagaraju penumalaFirst Published Mar 8, 2019, 3:17 PM IST
Highlights

నంద్యాల నియోజకవర్గంలో ప్రముఖ వ్యాపార వేత్త పోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచ బ్రహ్మానందరెడ్డి రాబోయే ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. వ్యాపారవేత్తగా మంచి పేరున్న బ్రహ్మానందరెడ్డిని వైసీపీలో చేరడంతో కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ మెుదలైంది. 

కర్నూలు: కర్నూలు జిల్లా రాజకీయాలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయా పార్టీల అభ్యర్థులు, తటస్థులు ఇతర పార్టీలలోకి జంప్ చేస్తున్నారు. దీంతో జిల్లాలో వలసల పర్వంపై తీవ్ర చర్చ కొనసాగుతోంది. 

ముఖ్యంగా ఈ జిల్లా నుంచి వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. నంద్యాల నియోజకవర్గంలో ప్రముఖ వ్యాపార వేత్త పోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పోచ బ్రహ్మానందరెడ్డి రాబోయే ఎన్నికల్లో నంద్యాల ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. 

వ్యాపారవేత్తగా మంచి పేరున్న బ్రహ్మానందరెడ్డిని వైసీపీలో చేరడంతో కర్నూలు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జోష్ మెుదలైంది. ఇకపోతే గంగుల ప్రతాప్ రెడ్డి సోదరుల ఒత్తిడితో పోచ బ్రహ్మానందరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు తెలుస్తోంది. 

2014 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నంద్యాల ఎంపీ అభ్యర్థిగా ఎస్పీ వై రెడ్డి పోటీ చేసి గెలుపొందారు. అయితే గెలుపొందిన కొద్ది రోజుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. 

ఆనాటి నుంచి ధీటైన అభ్యర్థికోసం జగన్ వేటాడుతున్నారు. ఈ తరుణంలో పోచ బ్రహ్మాంనందరెడ్డి వైసీపీలో చేరడంతో నంద్యాల ఎంపీ అభ్యర్థి దొరికినట్లైయ్యిందని కర్నూలు జిల్లా వాసులు అభిప్రాయపడుతున్నారు. 
 

click me!