గుంటూరులో ఎంపీ అభ్యర్థులుగా బెంగ‌ళూరు బుల్లోడు, చిత్తూరు చిన్నోడు: పవన్ కల్యాణ్

By Arun Kumar PFirst Published Mar 25, 2019, 7:48 PM IST
Highlights

గుంటూరు ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్థానిక అభ్యర్థులు కరువైనట్లుగా వైఎస్సార్‌సిపి, టిడిపిలుగా  స్థానికేతరులను బరిలోకి దించడం ఈ జిల్లాకే అవమానమన్నారు. వెఎస్సార్‌సిపి అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిని బెంగ‌ళూరు బుల్లోడని, టీడీపీ అభ్య‌ర్ధి  గల్లా జయదేవ్ ని చిత్తూరు చిన్నోడని ఎద్దేవా చేశారు. కానీ జ‌న‌సేన అభ్య‌ర్ధిగా ఫోటీ చేస్తున్న బోన‌బోయిన శ్రీనివాస్ స్థానిక నాయకుడేనని పవన్ తెలిపారు. 
 
గుంటూరు ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ మాట్లాడుతూ... మీకు ఎప్పుడూ అందుబాటులో వుండే నాయకుడు కావాలో, ఎన్నికల తర్వాత మళ్లీ కనిపించని నాయకులు కావాలో తేల్చుకోవాలని ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరికి అండ‌గా వుండే మంచి మనిషి శ్రీనివాస్ అని...అలాంటి వ్యక్తి ద‌శాబ్దాలుగా క‌ష్ట‌ప‌డినా తెలుగుదేశం పార్టీ ఆయ‌న‌కి గుర్తింపు ఇవ్వ‌లేదన్నారు. అందువల్లే  ఆయనకు జనసేన ప్రత్యేక గుర్తింపు ఇచ్చి లోక్ సభ అభ్యర్థిగా బరిలోకి దింపిందని వెల్లడించారు.   

రాజధాని అమ‌రావ‌తిలో కూడా టీడీపీ కోట‌లు బ‌ద్ద‌లు కొడ‌తామని పవన్ పేర్కొన్నారు. తెలుగుదేశం ప్ర‌భుత్వానికి దమ్ము, ధైర్యం లేవని...అందువల్లే సొంత ఎమ్మెల్యేలను అదుపు చేయలేకపోతోందని విమర్శించారు. రాష్ట్రంలో మార్పు కోరుకుంటున్న వారు జ‌న‌సేన కు మాత్రమే ఓటెయ్యాలని పవన్ సూచించారు. 

ఇక గుంటూరు ప‌శ్చిమ ఎమ్మెల్యే అభ్య‌ర్ధి స్థానిక నాయకులు తోట చంద్ర‌శేఖ‌ర్, తూర్పు  అభ్యర్థిగా రెహ్మాన్ ను గెలిపించాలని కోరారు. నిరంత‌రం మీకు అందుబాటులో ఉండే వ్య‌క్తులైన వీరు గెలిస్తేనే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని...అప్పుడే గుంటూరు అభివృద్ది చెందుతుందని పవన్ అన్నారు. కాబట్టి పోలింగ్ రోజు ఓ సారి ఆలోచించి మీ భ‌విష్య‌త్తుని దృష్టిలో వుంచుకుని ఓటేయాలని పవన్ సూచించారు. 

గుంటూరు జిల్లాకు చెందిన తనను ముఖ్యమంత్రిగా గెలిపించాలని పవన్ కోరారు. బాప‌ట్ల‌లో పుట్టిన తనకు ప‌ల్నాటి పౌరుషం వుందన్నారు. కాబట్టే గుంటూరు జిల్లా నుండే ముఖ్యమంత్రి వుండాలని కోరుకున్నానని అన్నారు. ఇలా కొత్త రాజ‌ధానికి కొత్త ముఖ్య‌మంత్రిని తానే అవుతానని పవన్ ధీమా వ్యక్తం చేశారు. 

click me!