మొన్నటి చెంపదెబ్బ మరిచారా: బాబు, ఆంధ్రజ్యోతిలపై విజయసాయి ఫైర్

Siva Kodati |  
Published : Apr 02, 2019, 01:28 PM ISTUpdated : Apr 02, 2019, 01:29 PM IST
మొన్నటి చెంపదెబ్బ మరిచారా: బాబు, ఆంధ్రజ్యోతిలపై విజయసాయి ఫైర్

సారాంశం

ప్రస్తుత లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో విజయావకాశాలపై టీడీపీ- ఆంధ్రజ్యోతి సర్వేపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మండిపడ్డారు. వరుస ట్వీట్లతో చంద్రబాబు, ఆస్ధాన జ్యోతిష్యుడు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికను ఉద్దేశిస్తూ ధ్వజమెత్తారు. 

తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు కూటమికే మొగ్గు అంటూ లగడపాటితో కలిసి మస్కా కొట్టబోతే చెంప చెళ్ళుమనే తీర్పు ఇచ్చారు జనం. ఆ వాతలింకా మాననే లేదు.  మళ్ళీ మా బాబుకే పట్టాభిషేకం అంటూ నిన్న ఆస్థాన కుల ‘జ్యోతి’ష్యుడు నకిలీ సర్వేతో ఆంధ్రుల కళ్ళు కప్పబోయి బొక్కబోర్లా పడ్డాడు. సిగ్గు లేని జన్మ! అంటూ ఫైరయ్యారు. 

మీ జీవితంలో ఎప్పుడైనా నిజం మాట్లాడారా చంద్రబాబు? జమ్మలమడుగు సభలో జగన్ గారిపై చేసిన వ్యాఖ్యలకు ప్రజలు మీపై ఉమ్ముతున్నారు. కేటీఆర్ స్వయంగా జగన్ గారిని కలిసి 42 మంది ఎంపీలతో కేంద్రంపై వత్తిడి తెద్దామని కోరిన సంగతి మర్చిపోయారా? ప్రజలకు మాత్రం బాగా జ్ణాపకం ఉందన్నారు.

తాజా ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 126 నుంచి 135 ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 22 ఎంపీ సీట్లు గెలవనుందంటూ లోక్‌నీతి-సీఎస్‌డీఎస్ సర్వేలో వెల్లడైనట్లు ఆంధ్రజ్యోతి ప్రచురించింది. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు