చంద్రబాబు పేరులో ద్ర అంటే దరిద్రం : బాబుకు విజయసాయి కౌంటర్

Published : Apr 05, 2019, 06:02 PM IST
చంద్రబాబు పేరులో ద్ర అంటే దరిద్రం : బాబుకు విజయసాయి కౌంటర్

సారాంశం

జగన్ లోనే గన్ ఉందని అలాంటి వారు అధికారంలోకి వస్తే అరాచకాలు చెలరేగుతాయని బాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పేరులో ‘ద్ర’ ఉందని ద్ర అంటే దరిద్రమని ప్రజలంతా చెప్పుకుంటున్నారని సెటైర్ వేశారు. 

అమరావతి: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరుపై చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. 

జగన్ లోనే గన్ ఉందని అలాంటి వారు అధికారంలోకి వస్తే అరాచకాలు చెలరేగుతాయని బాబు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు పేరులో ‘ద్ర’ ఉందని ద్ర అంటే దరిద్రమని ప్రజలంతా చెప్పుకుంటున్నారని సెటైర్ వేశారు. 

జగన్ పేరులో గన్ ఉందన్న విషయాన్ని చంద్రబాబు భూగోళ, ఖగోళ శాస్త్రాలన్నింటిని శోధించి కనిబెట్టారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే ఆయన వెంట తుఫాన్లు కరవు కాటకాలు కాచుకుని ఉంటాయని ధ్వజమెత్తారు. జనాలు నవ్వుకుంటారన్న స్పృహ కూడా లేకుండా చంద్రబాబు వణుకుతూ ఏదో గొణుగుతున్నారని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు