మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటా, నా తలుపుతట్టండి : రోజా

Published : Apr 03, 2019, 03:42 PM IST
మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటా, నా తలుపుతట్టండి : రోజా

సారాంశం

నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన ఇంటి తలుపు తట్టవచ్చని స్పష్టం చేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని తన వంతు సాయం చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. నాలుగున్నర ఏళ్లు మహిళలను మోసం చేసిన చంద్రబాబును ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. 

నగరి : మహిళలకు అండగా నిలిచే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వైసీపీ నగరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి రోజా స్పష్టం చేశారు. నగరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రోజా నియోజకవర్గంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా తన ఇంటి తలుపు తట్టవచ్చని స్పష్టం చేశారు. 

ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటానని తన వంతు సాయం చేస్తానని ఆమె భరోసా ఇచ్చారు. నాలుగున్నర ఏళ్లు మహిళలను మోసం చేసిన చంద్రబాబును ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. 

పసుపు కుంకుమ పేరిట ఇచ్చే తాయిలాలకు ఎవరూ మోసపోవద్దని సూచించారు. మన భవిష్యత్‌ బాగుండాలంటే మహిళా సాధికారత సాధ్యం కావాలంటే జగనన్నను సీఎం అయితేనే సాధ్యమన్నారు. 

వైసీపీకి అధికారం అప్పగిస్తే నాలుగు దఫాలుగా డ్వాక్రా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. వడ్డీలేని రుణాలు అందించి ఆదుకుంటామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ మహిళలకు నాలుగు దఫాలుగా రూ.75 వేలు సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. 

పిల్లల్ని చదివించే తల్లులకు సంవత్సరానికి రూ.15వేలు వారి ఖాతాల్లోనే జమ చేస్తామని స్పష్టం చేశారు. ప్రతి కుటుంబానికి లక్ష నుంచి రూ.5 లక్షల వరకు లబ్ధి చేకూరేవిధంగా నవరత్నాలు పథకాలు రూపొందింంచామని తెలిపారు రోజా. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు