ఓటమి భయంతోనే చంద్రబాబు నిరసన...సీఎం లెటర్ ప్యాడ్‌తో ఫిర్యాదులా..?: నాగిరెడ్డి

By Arun Kumar PFirst Published Apr 10, 2019, 3:13 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఎన్నికల్లో ఓడిపోతానన్న భయం పట్టుకుందని వైఎస్సార్‌సిపి నాయకులు నాగిరెడ్డి అన్నారు. అందువల్లే ఎన్నికలకు ముందు గందరగోళ పరిస్థితులను సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇందులో భాగంగా ఎన్నికలకు ఒకరోజు ముందే  రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి ఫిర్యాదు చేయడం...ఆ వెంటనే ఈసీ కార్యాలయం ఎదుట నిరనసనకు దిగడం చేస్తున్నారంటూ తెలిపారు.
 
 తమ పార్టీ నాయకులు వివేకానంద రెడ్డి హత్య గురించి మాట్లాడవద్దంటూ కోర్టు ఆదేశించినా చంద్రబాబు పదేపదే ఆ హత్య గురించి మాట్లాడుతున్నారని గుర్తుచేశారు. ఇలా కోర్టు దిక్కారానికి పాల్పడుతున్న అతడు ఇప్పుడు ఎన్నికల కమీషన్ ఆదేశాలను ప్రశ్నిస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రిగా అత్యున్నత పదవిలో వున్న ఆయనకు ప్రజాస్వామ్యబద్దంగా ఏర్పాటైన సంస్థలంటే గౌరవం లేకుండా పోయిందని విమర్శించారు. తానేది చేసినా అదే చట్టం, ఏది మాట్లాడితే అదే వేదం అన్నట్లుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓ సీఎం హెదాలో వున్న వ్యక్తి కార్యక్రమాలు చేపట్టడం చాలా తప్పన్నారు. మే 22 తారీఖున వచ్చే ఫలితాపై వున్న భయంతోనే చంద్రబాబు ఇలా ప్రవర్తిస్తున్నారన్నారు. ఆయన ప్రస్తుతం తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు మాత్రమేనని...కేవలం పరిపాలనా కార్యక్రమాల్లో మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరించాలన్నారు. కానీ అన్ని పార్టీ పనులను కూడా ఆయన ముఖ్యమంత్రి హోదాలోనే చేస్తున్నారని నాగిరెడ్డి ఆరోపించారు. 

రాష్ట్ర ఎన్నికల అధికారకి ఓ ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయడం ఇదే మొట్టమొదటిసారని చంద్రబాబు అంటున్నారని...కానీ ఆయన ముఖ్యమంత్రిగా కాకుండా ఓ పార్టీ అధ్యక్షుడిగా మాత్రమే ఈసీని కలిశారని గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికల ప్రచారానికి మంగళవారం సాయంత్రంతో సమయం ముగియగా 6 గంటల 11 నిమిషాలకు ముఖ్యమంత్రి లెటర్ ప్యాడ్ పై చంద్రబాబు కొన్ని హామీలను ప్రకటించారని ఆరోపించారు. అంతేకాకుండా ఇవాళ ఎన్నికల సంఘానికి కూడా ముఖ్యమంత్రి లెటర్ ప్ప్యాడ్ పైనే ఫిర్యాదు చేయడం ఎంతవరకు సమంజసమని నాగిరెడ్డి ప్రశ్నించారు. దీనిపై సుమోటాగా తీసుకోని ఈసీ చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 
 
click me!