ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలపై హైకోర్టులో మరో పిటిషన్

Siva Kodati |  
Published : Mar 28, 2019, 09:13 PM IST
ఏపీలో ఐపీఎస్‌ల బదిలీలపై హైకోర్టులో మరో పిటిషన్

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ల బదిలీ వ్యవహారం పెను వివాదంగా మారుతోంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది.

ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్‌ల బదిలీ వ్యవహారం పెను వివాదంగా మారుతోంది. ఇప్పటికే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెబుతూ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ కూడా హైకోర్టును ఆశ్రయించింది.

బుధవారం ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం. 720, 721 నిలిపివేయాలని వైసీపీ పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల సంఘం ఆదేశాలను అనుసరించి ముగ్గురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.

ఆ తర్వాత ఇంటెలిజెన్స్ చీఫ్‌ను మినహాయిస్తూ మరో జీవో జారీ చేసింది. ఈ రెండు జీవోల అమలును నిలిపివేయాలని కోరుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్‌లో పేర్కొంది. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు