కుప్పంలో ఆధిక్యంలో చంద్రబాబు

Published : May 23, 2019, 09:38 AM ISTUpdated : May 23, 2019, 09:44 AM IST
కుప్పంలో ఆధిక్యంలో చంద్రబాబు

సారాంశం

చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి నారా చంద్రబాబునాయుడు వెనుకంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి  చేతిలో చంద్రబాబునాయుడు 67 ఓట్ల  వెనుకంజలో ఉన్నారు. అయితే రెండో రౌండ్ లో చంద్రబాబునాయుడు వైసీపీ అభ్యర్ధి కంటే ముందంజలో నిలిచారు.

కుప్పం: చిత్తూరు జిల్లా కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్ధి నారా చంద్రబాబునాయుడు వెనుకంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధి  చేతిలో చంద్రబాబునాయుడు 67 ఓట్ల  వెనుకంజలో ఉన్నారు.రెండో రౌండ్‌కు వచ్చే సరికి చంద్రబాబునాయుడు ఆదిక్యంలోకి వచ్చారు.

చిత్తూరు జిల్లాలోని కుప్పం నుండి చంద్రబాబునాయుడు వరుసగా విజయం సాధిస్తున్నారు.  కానీ, ఈ దఫా మరోసారి చంద్రబాబునాయుడు ఇదే స్థానం నుండి పోటీ చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబునాయుడుపై పోటీ చేసిన ఐఎఎస్ అధికారి చంద్రమౌళి కూడ బరిలో ఉన్నారు.

చంద్రమౌళి చేతిలో  చంద్రబాబునాయుడు వెనుకంజలో ఉన్నారు. వైసీపీ అభ్యర్ధికి 4456 ఓట్లు వస్తే టీడీపీకి 4389 ఓట్లు దక్కాయి ఇక రెండో రౌండ్‌కు వచ్చేసరికి చంద్రబాబునాయుడు వైసీపీ అభ్యర్ధి కంటే ఆధిక్యంలో నిలిచారు.
 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు