ఈవీఎంలలో సమస్యలు... కౌంట్ లో కనపడని ఓట్లు

By telugu teamFirst Published May 23, 2019, 9:27 AM IST
Highlights

ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. కాగా.. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. 

ఏపీలో ఎన్నికల ఫలితాలకు కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. గురువారం ఉదయం 8గంటలకు ఎన్నికల సిబ్బంది కౌంటింగ్ ప్రారంభించారు. కాగా.. ఒక్కొక్కటిగా ఫలితాలు వెలువడుతున్నాయి. అయితే.. కర్నూలు జిల్లా ఆలూరు ఈవీఎంలలో మాత్రం సాంకేతిక సమస్య తలెత్తింది. ఓట్ల లెక్కింపులో భాగంగా ఆలూరు, 1,7,8 పోలింగ్‌ కేంద్రాల్లో ఈవీఎంల్లో సమస్యలు తలెత్తాయి. ఈవీఎంలు ఇన్‌వాలిడ్‌ ఓట్లుగా చూపిస్తున్నాయి. దీంతో..అభ్యర్థులు కంగారుపడుతున్నారు. ప్రస్తుతానికి ఇక్కడ కౌంటింగ్ నిలిచిపోయింది.

ఆంధ్రప్రదేశ్ శాసనసభకు లోకసభతో పాటు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11వ తేదీన రాష్ట్రంలోని 175 స్థానాలకు పోలింగ్ జరిగింది. తెలుగుదేశం, వైఎస్సార్ కాంగ్రెసు, జనసేన మధ్య రాష్ట్రంలో ముక్కోణపు పోటీ జరిగింది. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం జరుగుతోంది.

click me!