
విజయవాడ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఉగాది పర్వదినాన అమరావతిలోని పార్టీ కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టో విడుదల చెయ్యనున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ మేనిఫెస్టోను విడుదల చెయ్యనున్నారని సమాచారం. ఇప్పటికే వైఎస్ జగన్ ప్రకటించిన నవరత్నాల పథకాలతోపాటు పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను కూడా మేనిఫెస్టోలో పొందుపరిచనట్లు తెలుస్తోంది.
మరోవైపు బీసీలకు ఇచ్చిన హామీలలో భాగంగా బీసీ డిక్లరేషన్, వృద్ధులు, మహిళలు, పించనర్లను ఆకర్షించే విధంగా మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోకు సంబంధించి కీలక అంశాలను ప్రచార సభలలో వైఎస్ జగన్ ప్రస్తావించనున్నారని అనంతరం ఉగాది పర్వదినాన మేనిఫెస్టో విడుదల చెయ్యనున్నట్లు ప్రచారం జరుగుతుంది.