చంద్రబాబుపై వైఎస్ షర్మిల ఘాటు వ్యాఖ్యలు

By narsimha lodeFirst Published Mar 25, 2019, 11:19 AM IST
Highlights

రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికినా కూడ అభివృద్ధి కన్పించడం లేదని వైఎస్  షర్మిల ఆరోపించారు.
 


హైదరాబాద్: రాష్ట్రంలో భూతద్దం పెట్టి వెతికినా కూడ అభివృద్ధి కన్పించడం లేదని వైఎస్  షర్మిల ఆరోపించారు.

సోమవారం నాడు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల అమరావతిలో  మీడియాతో మాట్లాడారు.రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి కన్పిస్తోందా అని ఆమె ప్రశ్నించారు.  వైఎస్ఆర్ పాలనలో రైతులు సంతోషంతో ఉండేవారని ఆమె గుర్తు చేసుకొన్నారు. 

బాబు పాలనలో రాష్ట్రం పాతిక ఏళ్లు వెనక్కు నెట్టివేయబడిందని ఆమె ఆరోపించారు.అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టిన ఐదు సంతకాలను కూడ చంద్రబాబునాయుడు నీరుగార్చారని షర్మిల విమర్శించారు.

ప్రజల కోసం కాకుండా పదవుల కోసమే చంద్రబాబునాయుడు హామీలు గుప్పిస్తారని ఆమె విమర్శించారు. చంద్రబాబునాయుడు నిప్పు కాదు.. తుప్పు అంటూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబునాయుుడు హాయంలో అవినీతి పెరిగిపోయిందని ఆమె విమర్శించారు. ఎన్నికల ముందు 600కు పైగా హామీలు  ఇచ్చారని ఈ హామీల్లో ఎన్ని హామీలను అమలు చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.

ఇరిగేషన్ నుండి ఇన్‌ఫ్రా వరకు అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. రాజధాని నిర్మాణం కోసం రైతుల నుండి భూములను కారు చౌకగా తీసుకొన్నారని ఆమె ఆరోపించారు. మోడీ, బాబు జోడీ రాష్ట్రానికి అన్యాయం చేసిందన్నారు. రోజుకో పూట, పూటకో మాట మాట్లాడడంలో చంద్రబాబునాయుడును మించిన వారు ఉండరని ఆమె చెప్పారు.

తాను వైఎస్సార్‌ కూతురుగానే కాకుండా సామాన్యురాలిగా మాట్లాడుతున్నట్టు చెప్పారు.అమరావతి అంటూ గ్రాఫిక్స్ చూపారు కానీ ఒక్క శాశ్వత భవనం కట్టారా. చంద్రబాబు పేద విద్యార్థుల భవిష్యత్ ఖునీ చేసింది నిజంకాదా. పేదవాడికి కార్పొరేట్ వైద్యాన్ని దూరం చేసింది నిజం కాదా అని ఆమె ప్రశ్నించారు.

చంద్రబాబు చందమామ ని తెచ్చిస్తా అంటే ప్రజలు నమ్మలా.... నిప్పు నిప్పు అంటే తుప్పు నిప్పవుతుందా అని ఆమె చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.జగనన్న ఊరూరా తిరిగి హూదా కోసం పోరాటం చేయకపోతే హోదా మాట వచ్చేదా చేతనైతే నిజం చెప్పాలన్నారు.చంద్రబాబు రోజుకొక మాట, పూటకో వేషంతో ఊసరవెల్లి కూడ సిగ్గుతో తలదించుకోవాల్సిందేనన్నారు.

9 ఏళ్ళు జగనన్న విలువల రాజకీయము చేశాడు, చంద్రబాబులా అధికారం కోసం వాగ్దానాలు ఇవ్వలేదు, పదవుల కంటే విశ్వసనీయత ముఖ్యం అనుకున్నాడని చెప్పారు. నాన్నలా అందరికి మేలు చేయాలనుకుంటున్నాడని ఆమె జగన్ రాజకీయాలను ప్రశంసించారు.


 

click me!