ఎన్నికల ప్రచారానికి వైసీపీ స్టార్ కాంపైనర్ : వైఎస్ షర్మిల షెడ్యూల్ ఖరారు

By Nagaraju penumalaFirst Published Mar 28, 2019, 8:05 AM IST
Highlights

వైఎస్ జగన్ కవర్ చెయ్యని నియోజకవర్గాలను వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైస్ షర్మిలతో ప్రచారం నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే వైఎస్ విజయమ్మ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వైసీపీ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా విడుదల చేసింది. వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు వైఎస్ షర్మిల కూడా ఈనెల 29 నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు.  

విజయవాడ: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసే పనిలో పడింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో పర్యటించేందుకు వైసీపీ వ్యూహాలు రచిస్తోంది. 

అందులో భాగంగా వైసీపీ తరుపుముక్క, స్టార్ కాంపైనర్ వైఎస్ షర్మిలను ఎన్నికల ప్రచార బరిలోకి దించనుంది. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలలో పాల్గొంటున్నారు. 

జగన్ కవర్ చెయ్యని నియోజకవర్గాలను వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, వైస్ షర్మిలతో ప్రచారం నిర్వహించాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇప్పటికే వైఎస్ విజయమ్మ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన వైసీపీ వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచార షెడ్యూల్ కూడా విడుదల చేసింది. 

వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మతోపాటు వైఎస్ షర్మిల కూడా ఈనెల 29 నుంచే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. గురువారం తన తల్లి వైఎస్ విజయమ్మతో కలిసి వైఎస్ షర్మిల పులివెందుల చేరుకోనున్నారు. 

అక్కడ నుంచి ఇడుపులపాయలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించనున్నారు. అనంతరం అక్కడ ప్రత్యక ప్రార్థనలు చెయ్యనున్నారు. ఇకపోతే మార్చి 29న గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. 

మార్చి 29న మంగళగిరి నియోజకవర్గంలోనూ, మార్చి30న గుంటూరు వెస్ట్, గుంటూరు ఈస్ట్‌ నియోజకవర్గాల్లో ఆమె పర్యటించనున్నారు. మార్చి 31న గంటూరు జిల్లా తాడికొండ, పెదకూరపాడు, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ షెడ్యూల్ విడుదల చేసింది. 

ఈ వార్తలు కూడా చదవండి

నేడు పులివెందులకు వైఎస్ విజయమ్మ: రేపట్నుంచి ఎన్నికల ప్రచారం

click me!