తిరుపతిలో వైఎస్ జగన్ ప్రమాణస్వీకారం: కేసీఆర్ తోపాటు 21 మంది సీఎంలు హాజరు

By Nagaraju penumalaFirst Published May 23, 2019, 1:44 PM IST
Highlights

ఈనెల 30న వైయస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. తొలుత జగన్ శ్రీవారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత తిరుపతి తారకరామ స్టేడియంలో ముఖ్మమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 
 
అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈనెల 30న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు ఆ పార్టీ వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈనెల 25న తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైయస్ జగన్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించనున్నారు. 

ఈనెల 25న జరిగే శాసనసభాపక్ష సమావేశంలో వైయస్ జగన్ ను వైయస్ఆర్ఎల్పీ నేతగా ఎన్నుకోనున్నారు. అనంతరం ఈనెల 30న తిరుపతిలోని తారకరామ స్టేడియంలో వైయస్ జగన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

ఈనెల 30న వైయస్ జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. తొలుత జగన్ శ్రీవారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత తిరుపతి తారకరామ స్టేడియంలో ముఖ్మమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

వైఎస్ జగన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ తోపాటు మెుత్తం 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే శారదా పీఠాధిపతి స్వరూపనందేంద్ర సరస్వతి కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. 

click me!