వైయస్ జగన్ ప్రకటించిన తొలి అభ్యర్థి కోలగట్ల గెలుపు

By Nagaraju penumalaFirst Published May 23, 2019, 1:28 PM IST
Highlights

ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును ఓడించారు. తెలుగుదేశం పార్టీలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న అశోక్ గజపతిరాజును ఓడించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 

అమరావతి: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన తొలి అభ్యర్ధి విజయం సాధించారు. వైయస్ జగన్ పాదయాత్రలో తొలి అభ్యర్థిగా కోలగట్ల వీరభద్రస్వామిని ప్రకటించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయనగరం అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. 

కోలగట్ల వీర భద్రస్వామి సమీప ప్రత్యర్థి మాజీకేంద్రమంత్రి అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిపై భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇకపోతే కోలగట్ల వీరభద్రస్వామి ఇప్పటి వరకు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 

ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసి మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతిరాజును ఓడించారు. తెలుగుదేశం పార్టీలో మకుటంలేని మహారాజుగా వెలుగొందుతున్న అశోక్ గజపతిరాజును ఓడించిన తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. 

తాజాగా అశోక్ గజపతిరాజు కుమార్తె అతిథి గజపతిరాజును ఓడించి మరోసారి రికార్డు సృష్టించారు. ఇకపోతే అతిథి గజపతిరాజు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.  
 
click me!