కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై వైఎస్ జగన్ స్పందన ఇదీ...

Published : Apr 11, 2019, 09:29 PM IST
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ పై వైఎస్ జగన్ స్పందన ఇదీ...

సారాంశం

హైదరాబాద్‌లో తన నివాసంలో  జగన్ గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కాబోతోందని ఆయన అన్నారు. ఈవీఎంలలో తప్పులు ఉన్నాయని చంద్రబాబు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు.

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావు రిటర్న్ గిఫ్ట్‌తో తనకు సంబంధం లేదని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. అది కేసీఆర్, చంద్రబాబులకు సంబంధించిన విషయమని వ్యాఖ్యానించారు. 

హైదరాబాద్‌లో తన నివాసంలో  జగన్ గురువారం రాత్రి మీడియాతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాక్షస పాలన అంతం కాబోతోందని ఆయన అన్నారు. ఈవీఎంలలో తప్పులు ఉన్నాయని చంద్రబాబు ఎలా చెబుతారని ఆయన ప్రశ్నించారు. పెద్ద ఎత్తున ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం తమకు అనుకూలమని ఆయన అభిప్రాయపడ్డారు. ఇది ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనమని అన్నారు. 

దేవుడి దయ వల్ల పోలింగ్ శాతం పెరిగిందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాటానికి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని ఆయన అన్నారు ఓటేస్తే వీవీ ప్యాట్‌లో వాళ్ల ఓటు కనిపిస్తుందని ఆయన చెప్పారు. తనకు కూడా తన ఓటు ఓటు కనిపించిందని ఆయన చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

చంద్రబాబును గురిపెట్టిన బిజెపి: ఎపిలో కమల వికాసం (వీడియో)
ఒకే తల్లి కడుపున పుట్టారు: ఒకేసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నారు